మాస్క్‌ పెట్టుకోలేద‌ని అమ్మాయికి లిప్ కిస్ పెట్టిన పోలీస్‌.. సీసీ టీవీలో రికార్డు..!

Update: 2021-02-20 14:22 GMT
మ‌న‌దేశం లాంటి కొన్ని చోట్ల క‌రోనా భ‌యం త‌గ్గింది త‌ప్ప‌, చాలా దేశాల్లో ప‌రిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. మాస్క్ పెట్టుకోక‌పోయినా.. భౌతిక దూరం పాటించ‌క‌పోయినా.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఒక వేళ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే భారీగా ఫైన్ విధిస్తున్నారు. పెరు దేశంలోనూ ఇలాంటి నిబంధ‌న‌లే అమ‌ల్లో ఉన్నాయి. అయితే, మాస్క్ పెట్టుకోలేద‌ని ఓ యువ‌తిని మంద‌లించిన పోలీస్‌.. చివ‌ర‌కు ఆమెకు ముద్దుపెట్టేయ‌డం విశేషం!

పెరు దేశంలోని ఓ పోలీస్ అధికారి లాక్‌డౌన్ విధుల్లో ఉన్నాడు. మాస్క్ లేకుండా తిరుగుతున్న ఓ యువతి అత‌ని కంట‌ప‌డింది. దీంతో.. మాస్క్ లేకుండా ఎందుకు తిరుగుతున్నార‌ని ప్ర‌శ్నించాడు. అంతేకాదు.. ఫైన్ వేసేందుకు కూడా సిద్ధ‌మ‌య్యాడు. అయితే.. జ‌రిమానా నుంచి త‌ప్పించుకునేందుకు ఆ యువతి అధికారికి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది.

'ఛాన్స్ దొరికిందిగా.. ఎందుకు వ‌దులుకోవాలి?' అనుకున్నాడో ఏమో.. తన మాస్క్ కూడా తీసేసిన సదరు పోలీస్ అధికారి లిప్ లాక్ పెట్టేశాడు. ఈ వ్యవహారం మొత్తం అక్కడున్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో బయటకు రావడంతో విషయం మొత్తం రచ్చ రచ్చయ్యింది. కరోనా తీవ్రంగా ఉండగా.. డ్యూటీ సక్రమంగా చేయాల్సిన పోలీసు.. తన మాస్కు కూడా తీసేసి బహిరంగంగా లిప్ లాక్ పెట్టడం తీవ్ర చర్చనీయమైంది. ఈ ఘటన మిరాఫ్లోర్స్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ వీడియో కాస్తా మీడియాకు చేరడంతో.. మొత్తం విస్తరించింది. దీంతో జిల్లా మేయర్ లుయీస్ మొలినా తీవ్రంగా స్పందించారు. వెంటనే పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అతడి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని సిటిజన్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఇబెరో రోడ్రిగెజ్ వెల్లడించారు.

Full View
Tags:    

Similar News