• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జేసీ క్షమాపణ...

జేసీ క్షమాపణ చెప్పాల్సిందే ..పోలిసుల సంఘం డిమాండ్!

By - Tupaki Desk
Update: 2019-12-19 05:17 GMT
జేసీ దివాకర్ రెడ్డి ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. అంతగా అయన ఫెమస్ . ఎందుకు అంటే ..అయన మాట తీరే వేరు. ఏ పార్టీలో ఉన్నాం అనేది అయనకి ముఖ్యం కాదు. తాను అనుకున్నది అనుకున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ఏకైక నాయకుడు. ప్రస్తుతం ఈయన టీడీపీ లో కొనసాగుతున్నప్పటి ..అప్పుడప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పై ఫైర్ అవ్వడం ..సీఎం జగన బాగా పరిపాలిస్తున్నాడు అని అనడం ఈయనకే చెల్లింది. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఓ  కార్యక్రమంలో మాట్లాడిన జేసీ - తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో బూట్లు నాకిస్తామంటూ , పోలీసులని అమానపరుస్తూ మాట్లాడారు. ఈ విషయంలో ఎవర్నీ విడిచిపెట్టేది లేదంటూ సవాల్ చేసారు. దీనితో జేసీ చేసిన ఆ హాట్ కామెంట్స్ పై ఇప్పుడు పోలీసు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా జేసీకి రక్షణగా పోలీసులు పనిచేస్తున్నారని - అలాంటి పోలీసు వ్యవస్థపై జేసీ ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తన అహంకారానికి జేసీ ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకున్నారని, అయినా ఆయనకు బుద్ధి రాలేదంటున్నారు పోలీసు సంఘం నేతలు.

తన వ్యాఖ్యలతో జేసీ - ఓ జోకర్ లా మారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టమన్న సంఘం నేతలు - జేసీపై కేసులు వేస్తామని.. అవసరమైతే క్రిమినల్ కేసుల వరకు వెళ్తామని హెచ్చరించారు. తమ పనితీరు ఎలా ఉందో తెలియాలంటే - వచ్చి స్పందన కార్యక్రమం చూడాలని అంటున్నారు. జేసీలా దిగజారి మాట్లాడడం తమకు చేతకాదంటున్న సంఘం నేతలు - తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మారి దీనిపై జేసీ ఏ విదంగా రియాక్ట్ అవుతారో..


Tags:    
  • Police Association 
  • JC Diwakar Reddy 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS