కొండ మీద మంత్రి పోచారానికి గుండెనొప్పి

Update: 2017-02-22 06:26 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమలలో ఉన్న ఆయన శ్రీవారి దర్శనం ముగించుకొని అతిధి గృహానికి చేరుకున్న కాసేపటికే ఆయన ఛాతీనొప్పికి గురయ్యారు. తీవ్రనొప్పితో విలవిలలాడుతున్న ఆయన్ను హుటాహుటిన తిరుమల కొండ మీద ఉన్న అశ్వని ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో ఉన్న అపోలో అత్యవసర హృదయ చికిత్సాలయంలో పోచారాన్ని చేర్పించారు.

అపోలో వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. మంత్రి పోచారానికి ఛాతీ నొప్పి వచ్చిందన్న విషయాన్నితెలుసుకున్న టీటీడీ జేఈవో వెంటనే అశ్విని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులతో మాట్లాడి.. దగ్గరుండి వైద్య సేవల్ని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమలకు వచ్చి మొక్కు చెల్లిస్తామని కేసీఆర్ మొక్కుకోవటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో సీఎం కేసీఆర్.. కుటుంబ సభ్యులు.. మంత్రులు.. సహచరులతో కలిసి కేసీఆర్ రేణిగుంటకు వచ్చి.. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఈ బృందంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. శ్రీవారి దర్శనం పూర్తి అయ్యాక.. ఈ రోజు మధ్యహ్నం 12 గంటలకు తిరుమల పుష్పగిరి మఠంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధ్యక్షుడు పెద్ది సుదర్శనరెడ్డి వివాహానికి హాజరుకావాల్సి ఉంది. అనుకోని రీతిలోఆయన అస్వస్థతకు గురయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News