త‌స్సాదియ్యా.. ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్టేస్తున్న మోడీ!

Update: 2022-11-20 14:37 GMT
రాజ‌కీయం అంటే రాజ‌కీయ‌మే!  దీనిలో ఎలాంటి మార్పు లేదు. ఎలాంటి కొర‌వ‌లేదు. అందునా మాట‌ల మాంత్రికుడుగా పేరున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ఎన్నిక‌ల వేళ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్టేస్తున్నారు. త‌న‌కు అవ‌కాశం.. పార్టీకి పాజిటివ్ ఓటు బ్యాంకు ఉన్న స్థానాల్లో ఒక ర‌కంగా ఆయ‌న రెచ్చిపోయి మాట్లాడుతుంటే.. పార్టీకి పెద్ద‌గా ప్ర‌భావం లేని ప్రాంతాల్లో మాత్రం.. వంద మెట్లు ఒకేసారి దిగిపోయినంత ఫీలింగ్ ఇచ్చి.. మాట‌ల‌తో మ‌చ్చిక చేసుకుంటున్నారు. దీంతో ఈ ప్ర‌సంగాలు వింటున్న నెటిజ‌న్లు.. ``ఏం మోడీ.. ఏం రాజ‌కీయం`` అని అనేస్తున్నారు.

రెండు రోజుల కింద‌ట‌.. మోడీ బీజేపీకి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ``గుజ‌రాత్ రూప‌శిల్పిని నేనే. నేనే దీనిని ఇంత సుంద‌రంగా నిర్మించాను`` అని చెప్పుకొని.. చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్నారు. ఇక‌, తాజాగా బీజేపీకి పెద్ద‌గా బ‌లం లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ.. ``గుజ‌రాతీలు నా గురువులు.. వారి ఆశీర్వాదం వ‌ల్లే నేను ఇంత ఎత్తుకు ఎదిగాను`` అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. ఆయ‌న ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతున్నాడే.. అని అనేస్తున్నారు జ‌నాలు.

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధాన మోడీ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే తమ పార్టీ లక్ష్యమని చెప్తున్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారు. గుజరాతీలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారి ఆశీర్వాదాలు తనకు కావాలని కోరుతున్నారు.

రాజ్‌కోట్ జిల్లా ధోరాజీలో  జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ, గుజరాత్ ప్రజలు తన గురువులని చెప్పారు. వారి ఆశీర్వాదాలు తనకు కావాలన్నారు. గుజరాత్ ప్రజలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారు తనకు శిక్షణనిచ్చి, తనను అభివృద్ధి చేశారని చెప్పారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ''అందుకే మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం'' అని చెప్పారు.

రెండు దశాబ్దాలపాటు సమైక్యంగా కృషి చేసినందుకే బీజేపీ ప్రజల ఆశీర్వాదాలను పుష్కలంగా పొందుతోందని చెప్పారు. కచ్ ఎడారి పెద్ద సమస్యగా ఉండేదని, దానిని గుజరాత్ కమానుద్వారంగా అభివృద్ధి చేశామని చెప్పారు. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోడీ మాట్లాడారు. కాగా, గుజరాత్‌లో 182 శాసన సభ స్థానాలున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి జరుగుతాయి.
Tags:    

Similar News