మోడీకి రాఖీ కట్టిన పాకిస్తానీ సిస్టర్!

Update: 2019-08-15 20:21 GMT
ఒకవైపు మోడీని బూచిగా చూపిస్తోంది పాకిస్తాన్. దేశీయంగా కూడా మోడీ విధానాలు, బీజేపీ విధానాలు ముస్లింలకు వ్యతిరేకం అన్నట్టుగా బీజేపీ వైరి పక్ష పార్టీలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. కశ్మీర్ పై మోడీ నిర్ణయంలో కూడా ముస్లిం యాంగిల్ ను లాగి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

అలా మోడీని యాంటీ ముస్లిం అనే విషయాన్ని హైలెట్ చేయడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాఖీ పండగ సందర్భంగా ఒక పాకిస్తానీ మహిళ భారత ప్రధానికి రాఖీ కట్టడం ఆసక్తిదాయకంగా మారింది.

ప్రతి రాఖీ పండుగ రోజునా రాజకీయ పార్టీల నేతలకు, కీలక పదవుల్లో ఉన్న వారికి అనేక మంది మహిళలు రాఖీ కడుతూ ఉండటం సంప్రదాయమే. అందులో భాగంగా ఈ సారి మోడీకి పలువురు మహిళలు రాఖీ కట్టి తమ సోదరుడిగా ఆయనపై ప్రేమను చాటుకున్నారు. అలాంటి వారిలో కమర్ మొహిసిన్ షైక్ అనే ఒక పాకిస్తానీ మహిళ కూడా ఉన్నారు.

ఆమె మోడీ గురించి మీడియాతో మాట్లాడారు కూడా. రాబోయే ఐదు సంవత్సరాలూ మోడీకి గొప్పగా ఉండాలని, ఆయన తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వాలని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ ఆరోగ్యం బాగుండాలని కూడా ఆమె ఆకాంక్షించారు.

ఈమె పాకిస్తాన్ లో పుట్టిన మహిళే. అయితే ఒక భారతీయ ముస్లిం వ్యక్తిని పెళ్లాడారు. అలంటి మహిళ నుంచి మోడీ పై సోదరభావం వ్యక్తం కావడం నిస్సందేహంగా ఆసక్తిదాయకమైన అంశమే.
Tags:    

Similar News