చైనా విభో అకౌంట్ డిలీట్ చేసిన ప్రధాని మోడీ !
భారత్ -చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా కి చెందిన దాదాపు 59 యాప్స్ ను ఇండియా లో బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గాల్వానా ఘర్షణ తరువాత దేశ వ్యాప్తంగా చైనా పై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ లో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకి చెందిన విభో యాప్ నుండి క్విట్ అయ్యారు. ప్రధాని మోడీకి చెందిన వీబో సోషల్ మీడియా ఖాతా బుధవారం ఖాళీగా కన్పించింది. ట్విట్టర్ తరహా ఈ సమాచార మాధ్యమంలో నుంచి ఆయన ఫోటో, వ్యాఖ్యలు, ఇప్పటివరకూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అన్నీ కన్పించకుండా పొయ్యాయి.
భారత్, చైనా ఘర్షణల తరువాతి పరిణామాలలో ఇరుపక్షాల మధ్య వెబ్ స్థాయిలో కూడా పరస్పర దాడి పరిస్థితి ఏర్పడుతూ వస్తోంది. పది రోజుల క్రితమే బీజింగ్ లోని భారతీయ ఎంబస్సీకి చెందిన అధికారిక సోషల్ మీడియా యాప్ వీచాట్ నుంచి సమాచారం అంతా ఎత్తివేశారు. ఇప్పుడు ప్రధాని వీబో అకౌంట్ కూడా ఖాళీ అయింది. ప్రధాని మోడీ వియిబో అకౌంట్‌ను 2015లో అట్టహాసంగా ప్రారంభించారు. దీనికి విశేష ప్రచారం కల్పించారు. ఈ ఖాతాకు 244000 ఫాలోయర్స్ ఉన్నారు. ప్రధానిగా మోడీ తొలిసారి చైనాలో పర్యటించడానికి ముందు దీనిని ఏర్పాటు చేశారు. ఈ సైట్‌ను ఎప్పటి నుంచి నిలిపివేశారనేది వెల్లడికాలేదు. అయితే బుధవారం నుంచి ఇది ఖాళీ అయింది.
భద్రతా, సమాచార ఉల్లంఘనల కారణంగా భారతదేశం టిక్ టాక్ తో పాటు 59 చైనా యాప్‌లను నిషేధించిన తరువాత ఈ సైట్ స్తంభించింది. తన ప్రత్యేక సైట్ లో ప్రధాని మోడీ భారత్, చైనా సంబంధాలను, చైనా నేత భారత్ పర్యటన ఫోటోలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ వస్తున్నారు. ఇది ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటివరకూ ప్రతి ఏటా జూన్ 15వ జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది ఈ సందేశం వెలువడలేదు.