టీవీలో మోడీ స్పీచ్ అయ్యాక దేశంలో ఏం జరిగింది?
మీరో విషయాన్ని గమనించారా? జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ఎప్పుడు ప్రకటించినా.. ఆ ప్రసంగం రాత్రి వేళలోనే ఉంటుంది. తాను చేయాలనుకున్న కీలక ప్రకటనలు.. సంచలన సందేశాలు ఏమైనా సరే రాత్రి వేళలోనో.. లేదంటు మరికాస్తా ఆలస్యంగానో చేయటం మోడీకి అలవాటే. ఆ క్రమంలోనే తాజా కరోనా వేళ.. జాతిని ఉద్దేశించి ఇచ్చే సందేశాన్ని రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ చేశారు.
ఎనిమిది గంటలకు సందేహం ఇవ్వటం స్టార్ట్ చేసిన మోడీ.. దగ్గర దగ్గర అరగంట పాటు మాట్లాడారు. ఆ సందర్భంలోనే దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎందుకిలాంటి నిర్ణయాన్ని తీసుకుందన్న విషయాన్ని చెబుతూ.. వైరస్ తీవ్రత దేశంలో ఎంత ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అలా సాగిన మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే ఏం జరిగిందన్నది చూస్తే.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజలు వీధుల్లోకి పోటెత్తారు.
21 రోజుల పాటు లాక్ డౌన్ చేస్తారన్న ప్రకటన వారిని రోడ్ల మీదకు పరుగులు తీసేలా చేసింది. కాకుంటే.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్.. కేరళ.. మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్నందున.. ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలిసినందున 21 రోజుల మోడీ ప్రకటన పెద్దగా కదిలించలేదు. కానీ.. ఇప్పటి వరకూ లాక్ డౌన్ లాంటి అనుభవం లేని రాష్ట్రాల్లో మాత్రం అలజడి చెలరేగింది.
మూడు వారాల పాటు ఇంట్లోనే ఉండాల్సి రావటంతో.. అందుకు తగ్గ ప్రిపరేషన్ చేసుకోవాలన్న ఉద్దేశం ప్రజల్లో కనిపించింది. మొత్తంగా.. మోడీ స్పీచ్ దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజల్ని ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీసేలా చేసింది. దీంతో.. పలువురు మోడీ స్పీచ్ ముందు.. మోడీ స్పీచ్ తర్వాత అంటూ.. రోడ్ల మీద రద్దీ తెలిపేలా ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.