ఫైజర్​ వ్యాక్సిన్​: బ్రిటన్​లో సైడ్​ఎఫెక్ట్స్​.. అమెరికాలో రిపీట్​..

Update: 2020-12-18 03:15 GMT
ఇప్పుడు ప్రపంచంలోనే చాలా సేఫ్​, ప్రభావవంతంగా పనిచేసే వ్యాక్సిన్​ ఏదన్నా ఉందంటే అది అమెరికాకు చెందిన ఫైజర్​ వ్యాక్సిన్​ మాత్రమే. క్లినికల్ ట్రయల్స్ లో ఆ వ్యాక్సిన్ చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చిందని చెబుతూ వస్తున్నారు. తొలి వ్యాక్సిన్​ మాదే నంటూ రష్యా స్పుత్నిక్​​-వి వ్యాక్సిన్​ ను ప్రకటించినప్పటికీ అదంత ఎఫెక్టివ్ ​గా పని చేయడం లేదు. అయితే ఆ టీకా రెడీ అయినప్పటి నుంచి అందరూ దాని పై సందేహాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అందుబాటు లో ఉన్న వ్యాక్సిన్ల లో ఫైజర్​ వ్యాక్సినే టాప్​. అయితే ఈ వ్యాక్సిన్​కు కూడా కొన్ని సైడ్​ఎఫెక్ట్​ కనిపిస్తున్నాయి. అయితే వాటిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రిటన్​లో కొన్ని వారాల క్రితమే ఫైజర్​ వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభించారు. అక్కడ వ్యాక్సిన్​ తీసుకున్న ఇద్దరిలో అలర్జీ లక్షణం కనిపించింది. తాజాగా అమెరికా లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ వ్యాక్సిన్​ తీసుకున్న కొంత మందికి బ్రిటన్​ లో వచ్చినట్టే అలర్జీ లక్షణాలు కనిపించాయి.

 వారికి కొన్ని నిమిషాలపాటు శ్వాసతీసుకోవడం లో ఇబ్బంది, కళ్లకింద వాపు, గొంతునొప్పి, వంటి లక్షణాలు కనిపించాయి. అయితే ఈ విషయంపై అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ స్పందించింది. ‘అమెరికాలో ప్రస్తుతం వ్యాక్సిన్​ అద్భుతంగా పనిచేస్తున్నది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతి తక్కువ మందిలో చిన్నపాటి సైడ్​ఎఫెక్ట్స్​ కనిపిస్తున్నాయి. ఏ వ్యాక్సిన్​ కయినా ఇటువంటివి సాధారణమే.’ అని అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ భరోసా ఇచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ శుక్రవారం  వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకే ఆయన వ్యాక్సిన్​ తీసుకుంటున్నట్టు సమాచారం.
Tags:    

Similar News