గుజరాత్ అంటే బీజేపీనే... స్వీప్ చేసి పారేసింది !

బీజేపీని గుజరాతీయ జనతా పార్టీ అని కూడా అనొచ్చేమో. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత ప్రేమాభిమానాలు ఇక్కడ బీజేపీ సొంతం.;

Update: 2026-04-29 03:50 GMT

బీజేపీని గుజరాతీయ జనతా పార్టీ అని కూడా అనొచ్చేమో. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత ప్రేమాభిమానాలు ఇక్కడ బీజేపీ సొంతం. దాదాపుగా నాలుగు దశాబ్దాలకు దగ్గర పడుతున్నా ప్రజలు కాషాయం మోజు వీడడం లేదు. అంతే కాదు కమలం పువ్వు చేత బట్టుకుని విజయ దరహాసం చేస్తున్నారు. తమ గడ్డ మీద నుంచి ముమ్మారు ముఖ్యమంత్రి అయి జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ముమ్మారు ప్రధాని అయిన నరేంద్ర మోడీ అంటే వారికి గురి. అందుకే బేజేపీకి వరుస విజయాల సిరి అని అంటున్నారు. ఎన్నిక ఏది అన్నది ప్రశ్న కాదు, బీజేపీదే జయం అన్నది మాత్రం నిఖార్సు అయిన నిజం. ఇది మరో మారు స్థానిక ఎన్నికల సాక్షిగా రుజువు అయింది.

కాషాయం జెండా ఎగిరింది :

గుజరాత్ లోని స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం స్వీప్ చేసి పారేసింది. కాంగ్రెస్ ఆప్ రెండు పార్టీలకూ చుక్కలు కనిపించేలా ఫలితాలు ఉండడం విశేషం. నగరాలు పట్టణాలు పల్లెలు ఇలా ఎక్కడ చూసినా కాషాయం జెండా ఎగిరింది. అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాలలో సైతం బీజేపీ ఘన విజయాలను నమోదు చేసినిద్. అంతే కాదు పోర్ బందర్, మోర్బీ వంటి చోట కూడా అన్ని సీట్లలో బీజేపీ విజయం సాధించడంతో గుజరాతీయుల ప్రేమ ఎలాంటిదో లోకానికి అర్ధం అయింది.

బలంగా బీజేపీ :

పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా ఎవరు కమలం పార్టీ గుర్తు మీద పోటీ చేసినా విజయమే వారిని వరిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీలు ఇలా ఎక్కడ చూసినా గెలిచి తన సత్తా చాటుకుంది. బీజేపీది ఇవాళా నిన్నా బలం కాదు నాలుగు దశాబ్దాల చరిత్ర ఆ పార్టీది. అందుకే బీజేపీ గెలుస్తూనే ఉంది. తనకు ఉన్న సంస్థాగత బలం ఏమిటో ప్రత్యర్ధులకు చాటి చెప్పడమే కాదు వారి ప్లేస్ ఏంటో కూడా చూపించింది.

సునామీ మాదిరిగా :

ఇక రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోయింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 192 సీట్లు ఉండగా.. బీజేపీ 158 స్థానాలు కైవసం చేసుకుంది.రాజకోట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న 72 సీట్లలో బీజేపీ 65 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 7 సీట్లకు పరిమితమైంది. 84 మున్సిపాలిటీల్లోని 2,030 సీట్లలో బీజేపీ 1,791 స్థానాలు గెలిచి విజయ దుందుభి మోగించింది. 34 జిల్లా పంచాయతీల్లో ఉన్న 1,090 సీట్లలో కమలం పార్టీ 568 గెలుచుకోగా, కాంగ్రెస్ 77 సీట్లకే పరిమితమైంది. ఇక 260 తాలూకా పంచాయతీల్లోని 5,234 సీట్లలో బీజేపీ 2,397 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 591 సీట్లు దక్కాయి. మొత్తం మీద చూస్తే వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ప్రీ ఎలక్షన్స్ బీజేపీకి తిరుగులేదని చాటాయి. దాంతో గతంలో ఎంతో కొంత సత్తా చాటిన ఆప్ ఈసారి చతికిలపడగా కాంగ్రెస్ ఆశలు కూడా అడుగంటాయని అంటున్నారు.

Tags:    

Similar News