మహా పీనాసి; లీటర్ పెట్రోల్ కు రూ.2 తగ్గింపు

Update: 2015-08-31 15:19 GMT
జనాల నడ్డి విరిగేలా భారం మోపేందుకు ఏ మాత్రం మొహమాటపడని ప్రభుత్వాలు.. అదే ప్రజలకు ఏమైనా ఇవ్వాలంటే మాత్రం  చేతులు రాని పరిస్థితి. పన్ను వడ్డింపుల విషయంలో ఎలాంటి మొహమాట పడిపోయే మోడీ సర్కారు.. జనాల మీద భారం తగ్గించే విషయంలో మాత్రం మహా పీనాసిగా వ్యవహరిస్తుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయినా.. లీటరు పెట్రోలు మీద తగ్గించే ధరల విషయంలో ఆచితూచి వ్యవహరించటం మోడీకి మాత్రమే చెల్లింది.

అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర 45 డాలర్లకు కాస్త అటూఇటూ ఊగిసలాడుతున్న పరిస్థితి. అయినప్పటికీ లీటరు పెట్రోలు ధరలు తగ్గించే విషయంలో మోడీ సర్కారు ప్రజల పట్ల ఎలాంటి మమకారం ప్రదర్శించటం లేదు. ముడిచమురు ధరలు భారీగా పడిపోయినా లీటరు వరకూ వచ్చేసరికి తగ్గించిన మొత్తం చూస్తే నోట మాట రాని పరిస్థితి.

ప్రతి నెలకు రెండు దఫాలు అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా ధరలు నిర్ణయించటం తెలిసిందే. తాజాగా.. పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా లీటరు పెట్రోల్ కు రూ.2.. డీజిల్ 50 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓపక్క ముడిచమురు ధరలు భారీగా తగ్గినా.. లీటరు పెట్రోల్ మీద భారీ తగ్గింపు ఖాయమనుకుంటున్నప్పటికి.. అందరిని నిరాశ పరుస్తూ నిర్ణయం తీసుకోవటం మోడీ సర్కారుకే చెల్లింది.
Tags:    

Similar News