• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మగ బిడ్డే కావాలంటున్న మన...

మగ బిడ్డే కావాలంటున్న మన దేశ ప్రజలు!

By - Tupaki Desk
Update: 2022-05-23 03:11 GMT
దేశంలో మగ బిడ్డే కావాలంటున్న ప్రజల శాతం అంతకంతకూ పెరుగుతోంది. ఆడ పిల్లలు కంటే మగ పిల్లలు కావాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ మేరకు జాతీయ కుటుంబ ఆరోగ్య (ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌-5) సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. మగపిల్లలు కుటుంబ వారసత్వాన్ని కాపాడాతారని తల్లిదండ్రులు భావిస్తున్నారని సర్వే వివరించింది. అలాగే వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సర్వే తెలిపింది.

ఈ సర్వేను దేశవ్యాప్తంగా 7.24 లక్షల మంది మహిళలు (15-49 ఏళ్ల వయసు), 1.01 లక్షల మంది పురుషులను (15-55 ఏళ్ల వయసు) ఇంటర్వ్యూ చేసి చేశారు. ఇందులో భాగంగా ఏపీలో 10,975 మంది మహిళలు, 1,558 మంది పురుషుల నుంచి సమాచారం సేకరించారు.

2019-21 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 80 శాతం మంది దంపతులు తమకు కనీసం ఒక కొడుకైనా ఉండాలని కోరుకున్నట్టు సర్వే వెల్లడించింది. మేఘాలయ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో మగ పిల్లలు కావాలనే వారి శాతం అధికంగా ఉన్నట్టు పేర్కొంది. కాగా, అత్యధికంగా మేఘాలయలో 22 శాతం మంది మహిళలు, 12 శాతం మంది పురుషులు తమకు ఎక్కువగా ఆడ పిల్ల కావాలని కోరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వివాహితలు 6.4 శాతం మంది మగ బిడ్డ కావాలని, 3.3 శాతం మంది ఆడ పిల్ల కావాలని కోరుకున్నారని సర్వే తెలిపింది. పురుషుల్లో అయితే 11.4 శాతం మంది కుమారులు, 4.1 శాతం మంది కుమార్తెలు ఉండాలని తెలిపారు.

 కాగా, దేశవ్యాప్తంగా అమ్మాయిలు కావాలని కోరుకునే వారి శాతం కూడా గతంలో కంటే పెరగడం విశేషం. అమ్మాయిలు కావాలని 2015-16 నాటి సర్వేలో 4.9 శాతం మంది కోరుకున్నారు. ప్రస్తుతం ఆడ పిల్లలు కావాలని 5.17 శాతం మంది కోరుకోవడం విశేషం.

అలాగే దేశంలో తొలిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1,000 మంది పురుషులకు 991 మంది స్త్రీలు ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు 1,020కి చేరింది. ఏపీలో అయితే 1,000 మంది పురుషులకు 1,021 ఉన్న మహిళల సంఖ్య 1,045కు పెరిగింది. పిల్లల లింగ నిష్పత్తిలో కూడా మెరుగుదల నమోదైంది. గతంలో చిన్నారుల జననాల నమోదులో వెయ్యిమంది మగపిల్లలకు 918 మంది ఆడపిల్లలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 929కి చేరింది.

భవిష్యత్తులో పిల్లలను కనాలనుకునే వివాహిత జంటలు ఆడపిల్లల కంటే మగపిల్లలను పొందాలనే అభీష్టాన్ని వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. మగపిల్లవాడి కోసం ఎదురు చూస్తూ ఆడపిల్లలను కంటున్నవారు కూడా అనేకమంది ఉన్నారు. 15-19 సంవత్సరాల వయసున్న యువతులపై జరిగిన సర్వేలో 65 శాతం మందికి కనీసం ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరు ఇకపై తమకు పిల్లలొద్దని చెప్పారు. ఇటువంటి వారి సంఖ్య గత సర్వేతో పోలిస్తే రెండుశాతం పెరిగింది.
Tags:    
  • BabyBoy 
  • NationalFamilyHealthSurvey 
  • MaleChild 
  • PeopleWantBabyBoy 
  • PopulationCount 
  • MarriedCouple 
  • NoGirlChild 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS