గాజువాకలో పవన్ ఓడిపోతాడు: ఫృథ్వీ

Update: 2019-04-17 09:51 GMT
కమెడియన్ ఫృథ్వీ మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా జగన్ ను విమర్శిస్తున్న పవన్, ఆయన సోదరుడు నాగబాబులను ఎండగడుతూ దుమ్మెత్తిపోశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోవడంతో ఆయన ఈ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో ఎక్కడెక్కడ ఓడిపోతుంది.? ముఖ్యంగా గాజువాకలో పవన్ గెలుస్తాడా లేదా అన్నదానిపై కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు.

ఫృథ్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. 2014లో తమ పార్టీ గెలుస్తుందని చివరి వరకూ భావించామని.. కానీ కొన్ని అనివార్య కారణాలు, కుట్రలు, కుతంత్రాల వల్ల ఓడిపోయామని తెలిపారు. కానీ ఈసారి వదిలే ప్రస్తకే లేదని.. ఈ ఎన్నికల్లో ఏపీలో అఖండ మెజార్టీతో గెలుస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో స్థానికత బాగా ప్రభావం చూపిందని.. హైదరాబాద్ నుంచి కోస్తా జిల్లాల్లో పోటీచేసిన పవన్ కు ఇదే పెద్ద మైనస్ అయ్యిందని ఫృథ్వీ చెప్పుకొచ్చారు. ప్రజలు రీల్ హీరోను కాదని.. రియల్ హీరో జగన్ కు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలు స్థానికంగా ఉండే నిజమైన లోకల్ లీడర్లకే పట్టం కట్టారని చెప్పుకొచ్చాడు.

ఈ ఎన్నికల్లో పవన్ పోటీచేసిన గాజువాక అసెంబ్లీలోఅక్కడ రెండు సార్లు గతంలో పోటీచేసిన నాగిరెడ్డిపై ఈసారి ప్రజల సానుభూతి బాగా పనిచేసిందని.. విద్యార్థులు, ఫ్రొఫెసర్లు ఆయనకే మద్దతునిచ్చారని.. ఇదే నాగిరెడ్డి గెలుపునకు ఇదే దోహదపడుతోందని ఫృథ్వీ వివరించారు. అందుకే గాజువాకలో పవన్ ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడని పోలింగ్ సరళి చెబుతోందని ఫృథ్వీ బాంబు పేల్చారు.

అయితే మే 23వరకు కూడా ఎవరూ గెలుస్తారో చెప్పలేం. ఓటర్లు తమ తీర్పును చెప్పేశారు. అప్పటివరకూ ఇలా ఊహాగానాలే తప్ప ఖచ్చితంగా ఓటమి, గెలుపును నిర్ణయించే పరిస్థితుల్లో ఈసీ కూడా లేదంటే అతిశయోక్తి కాదు.
    
    
    

Tags:    

Similar News