• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప‌వ‌న్ స్టేట్‌...

ప‌వ‌న్ స్టేట్‌ మెంట్ఃప్ర‌త్యేక హోదాను మ‌ర్చిపోలేదు

By - Tupaki Desk
Update: 2016-04-10 18:51 GMT
స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా విడుద‌ల అనంత‌రం మీడియాతో తొలిసారిగా ముచ్చ‌టించిన జ‌న‌సేన అధినేత‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ త‌నలోని పొలిటీషియ‌న్‌ని, ప‌వ‌ర్‌స్టార్‌ను ఏక‌కాలంలో ఆవిష్క‌రించారు. త‌న ప్ర‌స్తుత చిత్రం స‌ర్దార్ నుంచి మొద‌లుకొని త‌న రాబోయే చిత్రాలు, రాజ‌కీయ  భ‌విష్య‌త్‌పై క్లారిటీ ఇచ్చారు.

అభిమానులు త‌న అన్నయ్య చిరంజీవితో పోల్చి అంచనాలు పెంచుకుంటారని పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అంచనాలు పెంచుకుంటూ పోతే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. నా స్టైల్‌లో నేను పని చేసుకుంటూ వెళ్తున్నానని తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయడానికే తాను సినిమాల్లోకి వచ్చానని, త‌న పని తాను చేస్తాన‌ని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ఖుషీ తర్వాత రతన్‌పూర్‌ స్టోరీ ఆలోచన వచ్చిందన్నారు. సామాజిక అవగాహనపై సినిమా చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. సినిమాల్లో మూస ధోరణి అసలు నచ్చదన్నారు. ద‌ర్శ‌క‌కత్వంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని పవర్‌ స్టార్‌ స్పష్టం చేశారు. త‌న‌కున్న అనుభవంతో దర్శకత్వంలో సలహాలు మాత్రమే ఇస్తానని అన్నారు. మరో రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తానని, త్రివిక్రమ్‌, ఎస్‌జె.సూర్య దర్శకత్వంలో నటిస్తానని తెలిపారు. తెలుగులో తమిళ సినిమా మార్కెట్‌ పెరిగిందని, తెలుగు సినిమా తమిళంలోకి వెళ్లడానికి భయపడుతుందన్నారు. తాను దెబ్బతిన్నా ప్రయోగాలు చేయడానికి వెనుకాడనని చెప్పారు. ప్రత్యేకమైన మేనరిజం అంటే ఇష్టం ఉండదని, ఒక్కరోజు కూడా తాను స్టార్‌ డమ్‌ను అనుభవించాలనుకోలేదని చెప్పారు. తన దగ్గర డబ్బులు లేవని, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నెల గడవడానికే కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. సాంస్కృతికపరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ కలవలేవని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తన సినిమాల్లో తెలంగాణ భాష, సంస్కృతికి సముచిత స్థానం కల్పించానని అన్నారు.

రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావిస్తూ అన్నయ్యతో రాజకీయంగా అభిప్రాయ బేధాలున్నాయని పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. అయితే కుటుంబపరంగా మాత్రం ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. అన్నయ్య పూర్తి కాంగ్రెస్‌ వాది అని అన్నారు. పార్టీలు మారాలంటే బలమైన కారణాలుండాలని అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు కొన్ని పరిమితులు ఉండేవన్నారు. జనసేనలో నేను ఏం మాట్లాడినా నేనే బాధ్యత వహిస్తానని, అయితే ప్రజారాజ్యంలో నేనేం మాట్లాడినా అన్నయ్య బాధ్యత వహించాల్సి వచ్చేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. టన్నుల కొద్దీ మాటలకన్నా.. ఒక ఔన్స్‌ పనిచేయడం మంచిదన్నారు.  రిజర్వేషన్ల గురించి మాట్లాడితే కులంతో ముడిపెడతారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయమై తాను మరిచిపోలేదని ప‌వన్ స్ప‌ష్టం చేశారు. ప్రశ్నించేందుకు జనసేన, పోటీ చేసేందుకు 2019 ఎన్నిక‌లు ఉన్నాయ‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తానని చెప్పారు. రాజకీయాల్లో ఏం చేస్తానో.. చెప్పి చేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తే సినిమాలు మానేస్తానని ప్ర‌క‌టించారు.  రాజకీయాల్లో తిట్టే వాళ్లను, పొగిడే వాళ్లను భరించాలని చెప్పారు.
Tags:    
  • Pawan Kalyan 
  • Special Status 
  • Telugu News 

Similar News

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం జీవితాలను తాకట్టు పెడుతున్నారా?

2026-11-13 19:30 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

Copyright @2026

Powered by Blink CMS