పవన్ ది అయిపోయింది.. ఇక బాబు రెడీ

Update: 2019-11-05 08:16 GMT

ఏపీలో వర్షాలు బాగా పడి.. నదులు, వాగులు వంకలు అన్నీ నీటితో నిండిపోయి ఇసుక కొరత ఏర్పడింది. అయినా ఈ పాపం వైసీపీ ప్రభుత్వానిదేనంటూ రాజకీయల లబ్ధి కోసం ఏపీలో ఇసుక ఉద్యమం చేపడుతున్నాయి ప్రతిపక్షాలు.. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతో విశాఖలో లాంగ్ మార్చ్ చేశారు. ఇక మన లోకేష్ బాబు కూడా గుంటూరులో నిరసన దీక్ష చేశారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది.

ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 14న  విజయవాడలో 12 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.  గుంటూరు లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు డిసైడ్ అయ్యారు.

పవన్ చేసిన లాంగ్ మార్చ్ తో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందని.. దాన్ని మరింత పెంచడానికి తాను దీక్షకు రెడీ అవుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈనెల 14వ తేదీన 12 గంటల పాటు చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా దీక్షలో పాల్గొనాలని బాబు పిలుపునిచ్చారు.  

ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే చంద్రబాబు, ఆయన పార్ట్ నర్ పవన్ కళ్యాన్ చేస్తున్న ఈ ఇసుక ఉద్యమంపై వైసీపీ సీరియస్ అవుతోంది. ప్రజలు ఎన్నికల్లో కర్రుకాచి వాత పెట్టి నెలలు నిండకముందే ఇలా ఉద్యమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబు, పవన్ వైఖరిని తేల్చుకుంటామని చెబుతున్నారు.
Tags:    

Similar News