పార్లమెంట్ సమావేశాలు: హోదా కోసం పట్టు..ఎన్టీయేకే వైసీపీ సపోర్టు

Update: 2021-01-25 17:05 GMT
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 29వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల 1న బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతారు. ఈసారి కీలక బిల్లులు, జమిలి ఎన్నికలపై చర్చ కూడా చేస్తారని తెలుస్తోంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యానే సీఎంజగన్ తన పార్టీ ఎంపీలో భేటి అయ్యారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడి కీలకమైన బిల్లులు, ప్రతిపాదనలకు ఎలాంటి మద్దతు వ్యతిరేకత చేయాలనే అంశంపై జగన్ తన పార్టీ ఎంపీలకు వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఈ భేటి కొనసాగుతుందని తెలుస్తోంది.  జీఎస్టీ బకాయిల విడుదల, రైల్వే ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడం.. మూడు రాజధానుల ఏర్పాటు వంటి రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను పార్లమెంట్ సమావేశాల్లో బలంగా వినిపించాలని వైఎస్ జగన్, పార్టీ ఎంపీలకు సూచిస్తారని చెబుతున్నారు.

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై రాజీ ధోరణిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని.. అలాగని ఘర్షణ వైఖరికి పోకుండా సభలో లేవనెత్తాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ప్రత్యేక హోదా నినాదాన్ని ఉభయ సభల్లో బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని.. దీనిపై ప్రైవేటుగా బిల్లును ప్రవేశపెట్టేలా దిశానిర్ధేశం చేయవచ్చని తెలుస్తోంది. జమిలి ఎన్నికలు వంటి కీలకమైన బిల్లులపై ఓటింగ్ నిర్వహించాల్సి వస్తే ఎన్డీఏ వైపే మొగ్గు చూపేలా పార్టీ ఎంపీలకు సూచించారని సమాచారం.
Tags:    

Similar News