భారత్ భయం.. పాక్ ఇంకా తేరుకోలేదు..

Update: 2019-07-15 10:49 GMT
బాలాకోట్ దాడుల భయం.. పాకిస్తాన్ కు ఇంకా పోనట్టే కనిపిస్తోంది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద మూకలకు కేంద్రమైన బాలాకోట్ పై భారత వాయువిమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ సర్వనాశనం చేశాయి. పుల్వామాలో భారత సైనికులను చంపిన ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా భారత్ ఈ దాడి చేపట్టింది.

ఈ బాలాకోట్ మెరుపు దాడుల తర్వాత జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ వైమానిక స్థావరంలో భారత్ వాయుసేన విమానాలు ఇంకా అక్కడే అన్నింటిని సిద్ధంగా ఉంచాయి. ఇప్పటికే ఏమైనా జరగవచ్చని భారత్ సిద్ధంగానే ఉంది.  

అయితే భారత్ వాయుసేన దాడి జరిపినప్పటి నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో గగనతలాన్ని మూసివేయించింది. భారత సరిహద్దుల వెంబడి తన సేనలను మోహరించింది.ఫిబ్రవరి 26 నుంచి పాక్ సైనికులు అక్కడే అష్టకష్టాలు పడుతున్నారట..  ఇప్పటికీ భారత వాయు విమానాలు సరిహద్దునే ఉండడంతో అలాగే గగనతల నిషేధాన్ని అమలు చేస్తోంది.

భారత్ శ్రీనగర్ నుంచి యుద్ధ విమానాలను ఉపసంహరించేవరకు పాక్ సైన్యం అక్కడి నుంచి కదలమని అలాగే ఉంది. అలాగే గగనతలాన్ని కూడా నిషేధించింది. దీనివల్ల అంతర్జాతీయ విమానాలు, హెలీక్యాప్టర్లు ఆ ప్రాంతంలో తిరగని పరిస్థితి నెలకొన్నాయి. భారత్ భయానికి ఇంకా ఎన్ని రోజులు పాక్ ఇలా సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉంటుందో చూడాలి మరీ..

    
    
    

Tags:    

Similar News