• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సుప్రీంకోర్టు తీర్పు...

సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ ... తీర్పు పై ఒవైసీ ఏమన్నారంటే ..?

By - Tupaki Desk
Update: 2019-11-09 10:03 GMT
అయోధ్య స్థల వివాదంపై తాము సంతృప్తిగా లేమని ఐఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరహాలో తాను కూడా గౌరవిస్తానని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కోర్టు తీర్పు మీద AIMLB సంతోషంగా లేదని, తన అభిప్రాయం కూడా అదే అని చెప్పుకొచ్చారు.

సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్. కానీ, న్యాయస్థానం పొరపాటుపడదని లేదు కదా అంటూ చెప్పారు. ఎవరైతే బాబ్రీమసీదును కూల్చారో వారికే అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 6న మసీదును కూల్చకపోతే కోర్టు తీర్పు ఎలా ఉండేది? మసీదు అక్కడే ఉండి ఉంటే ఏం తీర్పు చెప్పేది? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు అప్పగించాలని కోర్టు సూచించింది. దీంతోపాటు ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయంపై అసదుద్దీన్ విబేధించారు. 'మసీదు కట్టుకోవడానికి భూమి లేక మేం పోరాటం చేయలేదు. మా న్యాయపరమైన హక్కు కోసం ఫైట్ చేస్తున్నాం. మాకు ఎవరో ఇచ్చే భూమి అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించాలని సూచించారు. తీర్పు తర్వాత ఎలాంటి ఆందోళనలు లేకుండా చూడాలని అసదుద్దీన్ అన్నారు. అలాగే  తీర్పును సవాలు చేసే విషయంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని  చెప్పారు.
Tags:    
  • OYC 
  • AIMLB 
  • Supreme Court Judgement 
  • Land Trusts 
  • Hyderabad Mp Asaduddin Reaction 
  • Tupaki News 

Similar News

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

మంటల బొమ్మలు చూసి నీళ్లు చిమ్మిన ఫైర్ సిస్టమ్.. ఫుడ్ స్టాల్‌లో వింత ఘటన!

2026-11-21 04:24 GMT

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

ఆంథ్రోపిక్ ఉద్యోగులకు భారీ లాభం.. ఒక్క ఐపీఓతో కోట్లలోకి షేర్ల విలువ!

2026-11-21 04:23 GMT

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

2026-11-21 03:32 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS