• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉల్లి.. వెల్లుల్లి...

ఉల్లి.. వెల్లుల్లి మాదిరిగానే మాంసం.. మోడీపై ఒవైసీ ఫైర్‌

By - Tupaki Desk
Update: 2022-04-05 14:30 GMT
నవరాత్రుల రోజుల్లో దక్షిణ ఢిల్లీలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. మాంసం అపవిత్రమైనదేమీ కాదని, ఉల్లి, వెల్లుల్లి ఎలాగో మాంసం కూడా కేవలం ఆహారమేనని అన్నారు. మాంసం కొనుగోలు చేయాలా వద్దా అనేది వంద శాతం ప్రజల ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంటుందని, వద్దనుకుంటే కొనుగోలు చేయకపోతే సరిపోతుందని ఓ ట్వీట్‌లో ఒవైసీ అన్నారు.

ప్రధాని మోడీపై కూడా ఒవైసీ తన ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనేది పారిశ్రామికవేత్తలకే పరిమితం చేయాలని మోడీ కోరుకుంటున్నారని అన్నారు. సైద్ధాంతిక పరమైన సహచరుల కోసమే దీనిని వర్తింప చేస్తున్నారని ఆరోపించారు. ''ఆదాయం కోల్పోతే పరిహారం ఎవరిస్తారు? మాంసమేమీ అపవిత్రం కాదు. ఉల్లి, వెల్లుల్లి తరహాలో అది కూడా ఆహారం మాత్రమే. 99 శాతం కాదు, 100 శాతం ప్రజలకు మాంసం కొనాలా వద్దా అనే ఛాయెస్ ఉంటుంది. వద్దనుకుంటే కొనరు'' అని ఒవైసీ తెలిపారు.

దీనికి ముందు, నవరాత్రుల సందర్భంగా 99 శాతం ప్రజలు ఉల్లి, వెల్లుల్లి తినరంటూ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ సూర్యన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే మాంసం దుకాణాల మూసివేతకు అధికారిక ఉత్తర్వులు ఇస్తామని,  దుకాణాలు తెరవడాన్ని అనుమతించమని అన్నారు. ఎస్‌డీఎంఎస్ కమిషనర్ జ్ఞానేష్ భారతికి ముఖేష్ సూర్యన్ ఈమేరకు ఒక లేఖ కూడా రాశారు. నవరాత్రి సందర్భంగా రోజువారీ దుర్గామాత పూజలు చేసేందుకు వెళ్లే వారు మాంసం దుకాణాలు దాటి వెళ్లాలన్నా, ఆ వాసన భరించాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని, భక్తుల మతపరమైన నమ్మకాలు దెబ్బతింటాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.

తన నిర్ణయానికి కారణాన్ని సూర్యన్ వివరిస్తూ, దుర్గామాత భక్తులు తొమ్మిది రోజులు కేవలం శాఖాహారంతోనే ఉపవాస దీక్షలు చేస్తారని, మాంసాహారం, ఆల్కహాల్, కొన్ని సుగంధ ద్రవ్యాలను ముట్టుకోరని చెప్పారు. దీనిపై ఒవైసీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఉల్లి, వెల్లుల్లి మాదిరిగానే మాంసం కూడా ఒక ఆహార‌ప‌దార్థ‌మ‌ని.. దీనిని ఎలా నిషేధిస్తార‌ని.. ప్ర‌శ్నించారు. దేశంలో ఆహారంపైనా ఆంక్ష‌లు.. కుల మ‌తాల‌ను పులుముతున్నార‌ని.. ఆయ‌న ఫైర్ అయ్యారు. ఈ ప‌రిస్థితి ప్ర‌పంచంలో ఒక్క భారత్‌లోనే సాధ్య‌మ‌ని.. ఆహారంపై ఆంక్ష‌లు విధించే దేశం ఒక్క ఈ దేశ‌మేన‌ని అన్నారు.
Tags:    
  • owaisi party 
  • Asaduddin Owaisi 
  • Asaduddin Owaisi comments 
  • Bjp party 
  • Narendra Modi 
  • Delhi 
  • Non Veg Ban 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS