క‌ల‌క‌లం: ఏలూరు బాధితుల్లో ఇద్ద‌రు మృతి

Update: 2020-12-07 03:57 GMT
ఏలూరులో రెండు రోజులుగా విచిత్ర‌మైన అనారోగ్య‌ ల‌క్ష‌ణాల‌తో సామాన్య ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు తీస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. వాంతులు, విరేచ‌నాలు, త‌ల‌తిరుగుడు,  వికారం త‌దిత‌ర ల‌క్ష‌ణాల‌తో బాధితులు ఆసుప‌త్రుల పాల‌య్యారు. ముందు శుక్ర‌వారం రాత్రి ముందుగా కొంత‌మంది ఈ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డ‌గా.. ఆ త‌ర్వాత బాధితుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడా సంఖ్య వంద‌ల్లోకి వెళ్లిపోయింది. ఏం జ‌రుగుతోందో అర్థం కాక ఏలూరు జ‌నం భ‌య కంపితుల‌వుతున్నారు. ఇప్పుడు వారి భ‌యాన్ని మ‌రింత పెంచే ప‌రిణామం చోటు చేసుకుంది. అనారోగ్య ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రుల్లో చేరిన బాధితుల్లో ఇద్ద‌రు ప్రాణాలు విడిచారు.

అంతుచిక్కని జ‌బ్బుతో ఏలూరు ప్ర‌భుత్వ‌ ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో విద్యానగర్‌కు చెందిన 45  ఏళ్ల శ్రీధర్‌తో పాటు మరో వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్లు మీడియాలో వార్త‌లొస్తున్నాయి. శ్రీధ‌ర్ ఆసుప‌త్రిలో చేరే స‌మ‌యానికే తీవ్ర అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందించినా.. ఫ‌లితం లేక‌పోయింది. ఆయ‌న స‌మ‌స్యేంటో తెలుసుకునేలోపే ప్రాణాలు  కోల్పోయారు. ఏలూరు మున్సిపాలిటీ నీళ్లు క‌లుషితం కావ‌డం వ‌ల్లే అవి తాగిన జ‌నాలు అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు అనుమానిస్తున్నారు. కానీ ప్ర‌భుత్వ‌మేమో అలాంటిదేమీ లేదంటోంది. మాస్ హిస్టీరియా అంటూ ఏవో మాట‌లు చెబుతున్నారు కొంద‌రు అధికార పార్టీ నేత‌లు. ఐతే మున్సిపాలిటీ నీళ్లు తాగొద్ద‌న్న సందేశం అయితే జ‌నాల్లోకి బాగా వెళ్లిపోయింది. మ‌రి అనారోగ్యంతో ఆసుప‌త్రుల్లో చేరిన మిగ‌తా వారి ప‌రిస్థితేంటో.. అస‌లిలా ఎందుకు జ‌రిగిందో అంతుబ‌ట్ట‌ట్లేదు.
Tags:    

Similar News