చనిపోయిన ఆబార్షన్ల డాక్టర్ ఇంట్లో దారుణాలు

Update: 2019-09-17 01:30 GMT
అమెరికాలోని ఇండియానా అదీ.. అక్కడ అల్ రిచ్ క్లాఫర్ అనే డాక్టర్ ఎంతో ఫేమస్ అబార్షన్ల డాక్టర్ గా పేరుపొందాడు.. ఈయన ఇండియానాలో మూడు దశాబ్ధాలుగా గైనకాలజిస్టుగా మహిళలకు సంతానోత్సత్తి చేస్తుంటారు.

అయితే అమెరికాలో మహిళలకు అబార్షన్లపై కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఈ డాక్టర్ మాత్రం డబ్బు కోసం దారుణంగా అబార్షన్లు నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంటనేషన్ ఇత వివాదాలతో 2016లో ఈ డాక్టర్ మెడికల్ లైసెన్స్ ను స్టేట్ మెడికల్ బోర్డు రద్దు చేసింది.

తాజాగా అల్ రిచ్ క్లాఫర్ మరణించాడు. ఆయన మరణం తర్వాత ఆయన ఆస్తులను తనిఖీ చేసిన కుటుంబానికి సంచలన నిజాలు ఇంట్లో వెలుగుచూశాయి. 2246 పిండాలను ఆయన సురక్షితంగా ఫ్రిజ్ లో భద్రపరచడం చూసి కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఇవన్నీ ఆయన మహిళలకు చేసిన అబార్షన్ల పిండాలని పోలీసులు గుర్తించారు. దీనిపై అల్ రిచ్ కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఇంత మందికి అబార్షన్లు గుట్టుగా చేసి పిండాలను జాగ్రత్త చేసిన డాక్టర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
    

Tags:    

Similar News