బిహార్ లో తీవ్రవిషాదం..పిడుగులు పడి 11మంది మృతి!
బిహార్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వైపు కరోనా మహమ్మారి రాష్ట్రం లో విజృంభిస్తుంటే..మరో వైపు ప్రకృతి కూడా రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. గత కొద్ది రోజులు గా భారీ వర్షాల తో పాటు, పిడుగులు పడుతుంటం తో పదుల సంఖ్య లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా గా మంగళ వారం నాడు పలు జిల్లాల్లో మరో సారి పిడుగులు పడి పదకొండు మంది మరణించారు.
దాదాపు ఐదు జిల్లా లో మంగళ వారం పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో పదకొండు మరణించగా.. పలువురు గాయపడ్డారు. చాప్రా జిల్లాల్లో పిడుగు పాటుకు ఇద్దరు మహిళలు తీవ్రం గా గాయ పడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుల కుటుంబాలకు బిహార్ సీఎం నితీష్ కుమార్ రూ. నాలుగు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. కాగా, గత వారం రోజులుగా బిహార్ జిల్లాలో వరుసగా పిడుగులు పడుతుండటంతో ప్రజలు భయబ్రాంతులుకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు వంద మంది వరకు పిడుగు పాటుకు గురై మరణించారు.