పంచదార ఫ్యాక్టరీలో విషనాగులు వెయ్యికి పైనే!

Update: 2016-07-27 10:02 GMT
ఒక్క పామును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వెయ్యిపాములు. వింటేనే అదోరకంగా ఉన్నా.. ఇది నిజం. వివరాళ్లొకి వెళితే... తమిళనాడులోని కాంచీపురం జిల్లా మధురాంతకంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీని సుమారు 60ఏళ్ల కిందట 20 ఎకారాల్లో స్థాపించారు. అయితే కొన్నాళ్ల కిందట ఈ ఫ్యాక్టరీ మూతపడింది. అంత పెద్ద ప్రదేశం విత్ సేఫ్ రూఫ్ దొరకడంతో.. పాములు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.

అయితే ఆరేళ్ల కిందట డీఎంకే పరిపాలనలో ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించారు. ఎన్నోఏళ్లుగా ఏర్పరచుకున్న నివాసం కావడంతో ఫ్యాక్టరీకి కార్మికులు వస్తున్నా కూడా అవి స్వేచ్చగా తిరగడం ప్రారంభించాయి. దీంతో మూడు షిప్టుల్లో పనిచేసే ఉద్యోగులను నిత్యం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని విధులకు హాజరయ్యేవారు. దీంతో రోజు రోజుకీ పెరిగిపోతున్న ఈ పాముల బెడదపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వన్యప్రాణి సంరక్షణ అధికారులా సాయంతో పాములు పట్టేవాళ్లను రప్పించి రెండు రోజుల పాటు కుస్తీ పడితే రకరకాల జాతుల పాములు దొరికాయి. వాటిసంఖ్య వెయ్యికి పైనే ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు. దీంతో పట్టుబడిన ఆ వెయ్యిపాములను సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
Full View

Tags:    

Similar News