ఆన్ లైన్లో అదిరిపోయే ఛాయ్..

Update: 2015-08-02 11:43 GMT
    ప్రధాని నరేంద్రమోడీ చాయ్ కాన్సెప్టుతో ఇండియాలో చాయ్ కు పొలిటికల్ ఫ్లేవర్ కూ డా వచ్చేసింది. రాజకీయాల సంగతి పెడితే... టీని ప్రేమించేవారి సంఖ్య దేశంలో చాలా ఎక్కువ. అయితే.. ఒక్కోసారి కావాలనుకున్నప్పుడు టీ దొరకదు. ఇలాంటివారికోసం ముంబయిలో మంచి అవకాశం దొరికింది. ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే చాలు టీ తెచ్చిచ్చే వెబ్ సైట్ ఒకటి వెలిసింది. ఆన్‌లైన్‌లో టీ కొట్టును తెరిచి ఆర్డర్లు తీసుకుంటోంది చోటూచారువాలా.కామ్‌ అనే వెబ్ సైట్. అయితే... వీరి సేవలు ప్రస్తుతానికి ముంబయికే పరిమితం.

ముంబయిలోని బాంద్రా నిండా ఎటు చూసినా ఆఫీసులే ఉంటాయి.. మామూలుగానే ముంబయివాసులు టీ అంటే పడిచస్తారు. అలాంటి ఇన్ని ఆఫీసుల్లో నిత్యం పని ఒత్తిడిలో ఉండేవారికి టీ ఇంకా అవసరమిక్కడ. చైన్‌ స్మోకర్లు ఉన్నట్టే చైన్‌ చాయి డ్రింకర్లున్నారు అక్కడ. వారి అవసరాల కోసమే జెపో అనే సంస్థ చోటూచాయివాలా వెబ్‌ సైట్‌ను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ వెబ్‌ సైట్‌ కు మంచి స్పందనే వచ్చింది. ఆన్‌ లైన్లో ఆర్డరిస్తే నిమిషాల్లో టీ చేతికందేలా దీన్ని రూపొందించారు.

బాంద్రాలో ని స్థానిక చాయివాలలతో వీరు ఒప్పందం చేసుకుని వారికి సమీపంలో ఉండే ఆఫీసుల టీ అవసరాలను తీరుస్తున్నారు. ఆర్డర్‌ రాగానే సమీప టీ కొట్టుదారుకి ఎస్‌ఎంఎస్‌ వెళ్తుంది. అందులో ఆఫీస్‌ చిరునామా, ఆర్డర్‌ వివరాలు ఉంటాయి. ఎస్‌ఎంఎస్‌ అందుకున్న చాయివాలా టీని సరఫరా చేస్తాడు.  ఇది విజయవంతమైతే ఇతర నగరాలకు ఈ తరహా సేవలు విస్తరించాలని చూస్తున్నారు.
Tags:    

Similar News