కాస్కో రాజ్ నాథ్ కేసులతో వస్తున్నా !

ఎవరీ రవిదాస్ అని ఆలోచిస్తున్నారా ? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 251 సార్లు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన రాజకీయ నాయకుడు

Update: 2024-04-29 04:32 GMT

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో లోక్ సభ వేదికగా ఈసారి రసవత్తరమైన పోరు సాగుతున్నది. అక్కడ కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పోటీ చేస్తుండడం ఆసక్తికర అంశం కాగా ఆయనపై రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేస్తుండడం విశేషం.

ఎవరీ రవిదాస్ అని ఆలోచిస్తున్నారా ? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 251 సార్లు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన రాజకీయ నాయకుడు. విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నది.

1989 లక్నో తూర్పు స్థానం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రవిదాస్, 2012లో లక్నో సెంట్రల్ స్థానం నుండి గెలిచి అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో పనిచేశాడు. 2022లో అదే స్థానం నుండి గెలుపొంది ఈసారి లోక్ సభకు పోటీ చేస్తూ రాజ్ నాథ్ వంటి దిగ్గజాన్ని ఎదుర్కొంటున్నాడు.

‘’నా మీద ఉన్న కేసులన్నీ యూనివర్శిటీలో రోజుల్లో, రాజకీయాల్లో చేపట్టిన వివిధ నిరసన ప్రదర్శనలకు సంబంధించినవే. ఇందులో ఒక్కటి కూడా క్రిమినల్ కేసు లేదు. నేను పోరాట యోధుడిని అని ఈ గణాంకాలే చెబుతాయి. ప్రజల ముందు మహాయోధులే తలవంచారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేం’’ అని రవిదాస్ చెబుతున్నారు. మరి లక్నో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News