అమెరికాలో ఒరాకిల్ చేతికి టిక్ టాక్?
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్న టిక్ టాక్ యాప్ ను భధ్రతా కారణాల రీత్యా భారత్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, చాలాకాలంగా అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యం లో భారత్ బాట లోనే అమెరికా పయనించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అమెరికాలో టిక్‌టాక్ సంస్ధను దేశీయ సంస్ధలకు అమ్మేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కు టిక్ టాక్ అప్పగించబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ట్రంప్ చెప్పినట్లు కాకున్నా...అమెరికా కే చెందిన మరో టెక్ దిగ్గజం ఒరాకిల్ కు టిక్ టాక్ ను విక్రయించాలని టిక్‌టాక్ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం అమెరికన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టిక్ టాక్ కొనుగోలుపై ఒరాకిల్, బైట్ డ్యాన్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
చైనా సంస్ధ బైట్ డ్యాన్స్ మానసపుత్రిక, ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను ఒరాకిల్‌కు విక్రయించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ట్రంప్ కోరుకున్నట్లు మైక్రో సాఫ్ట్ కు కాకున్నా మరో దేశీయ సంస్థ ఒరాకిల్ కు అమ్మాలని బైట్ డ్యాన్స్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలన్న తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని మైక్రో సాఫ్ట్ ప్రకటించింది. అమెరికాలో గూఢచర్యానికి పాల్పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో టిక్ టాక్ పై ట్రంప్ నిషేధం విధించారు. మైక్రో సాఫ్ట్ కు టిక్ టాక్ కట్టబెట్టేందుకు ట్రంప్ పావులు కదిపినా ఫలితం దక్కలేదు. అయితే, టిక్ టాక్ ను ఒరాకిల్ టేకొవర్ చేసినా తనకు అభ్యంతరం లేదని ట్రంప్ గతంలో ఓ సందర్భంలో అన్నారు. అయితే, వైట్ హౌస్ కు కానీ, ఇతరులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండానే ఒరాకిల్ తో డీల్ ను బైట్ డ్యాన్స్ ముగించినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్‌ను ఒరాకిల్ అమెరికా వరకే తీసుకుంటుందా లేక భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ టేకోవర్ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. టిక్ టాక్ కు టెక్నాలజీ పార్ట్ నర్ గా ఒరాకిల్ ఉండ బోతోందని, అందుకుగాను టిక్ టాక్ లో మెజారిటీ వాటా దక్కనుందని తెలుస్తోంది.