పిక్ టాక్: అందమైన వధువుకు ఆన్ లైన్ లో పెళ్లి కష్టాలు
ఆమె చూడడానికి ఎంతో అందంగా ఉంది. దేవకన్యలా కనిపిస్తోంది. పెళ్లి కూతురులా ముస్తాబైంది. కొత్త పట్టు చీర, చేతికి కాళ్లకు గోరింటాకు పెట్టుకొని.. శిరోజాలను అందంగా అలకరించుకొని ముస్తాబై పెళ్లికి రెడీ అయ్యింది. కానీ ఆమె పెళ్లి జరిగేది ఎక్కడో బయట కాదు.. నాలుగు గోడల మధ్య.. ఓ లాప్ ట్యాప్ ముందు.. అందుకే అంత అందమైన అమ్మాయి ముఖంలో రక్తపు చుక్కలేదు.. ఆనందం లేదు.. బాధతో జూమ్ యాప్ లో బంధువులను చూస్తూ పెళ్లికి రెడీ అయ్యింది..
జూమ్ వివాహానికి ముందు ఆందోళన చెందుతున్న ఈ వధువు ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కరోనా వైరస్ లాక్ డౌన్ పుణ్యమాని పెళ్లిళ్లు ఇలా ఆన్ లైన్ లో చేసుకోవాల్సిన ఖర్మ దేశ ప్రజలకు పట్టింది.
జూమ్ క్లౌడ్ యాప్ లో ఈ పెళ్లిని ఆమె కుటుంబం మరియు స్నేహితులు ఆన్ లైన్ లోకి వచ్చి చూస్తున్నారు. వారిని చూస్తూ కలవరపడుతున్న వధువు ఫొటో వైరల్ గా మారింది. ఇలా జూమ్ క్లౌడ్ ద్వారా పెళ్లికి హాజరు కావడం పెళ్లి కూతురికే కాదు.. బంధువులకు కూడా ఒక ప్రత్యేకమైన అనుభవంగా మిగిలి పోయింది..
కరోనా మహమ్మారి వల్ల ఇలా వివాహాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. 50 కంటే తక్కువ మందితో సాధారణంగా సాదాసీదాగా పెళ్లి చేసుకోవడం ఒక తంతు అయితే.. అందరూ ఒకే చోట ఉంటే ఇది సాధ్యం. వేరు వేరు రాష్ట్రాల్లో ఉంటే మాత్రం ఇలా జూమ్ యాప్ లోనే వధువు మరియు వరుడు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా లేక లేక జీవితంలో తొలిసారి చేసుకుంటున్న పెళ్లి ఇలా జూమ్ యాప్ లో చేసుకునే సరికి ఆందోళనతో వధువు అందమైనది ముఖం వాడి పోయింది.