ఆన్ లైన్ క్లాసులు ...మానసిక ఒత్తడిలో విద్యార్థులు !
ఈ మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ఇప్పట్లో స్కూల్స్ ఓపెన్ చేసేలా కనిపించడంలేదు. ఈ లాక్ డౌన్ కాలంలో ఆన్ లైన్ క్లాసులంటూ స్కూల్ యాజమాన్యాలు సరికొత్త ఆలోచనతో ముందుకువచ్చాయి. అయితే ,ఈ ఆన్ లైన్ చదువులు పిల్లల్లో మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చదువులో వెనకబడిపోతామేమో అనే భయం..తరువాత భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం మరోపక్క..ఆన్ లైన్ పాఠాలు అర్థం కాక మరికొందరు విద్యార్ధులు ఇలా పలు కారణాలతో ఆన్ లైన్ క్లాసులతో పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోతోందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దాదాపు నెల రోజులుగా అన్ని స్కూల్స్ పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ సమస్త మానవాళి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెడితే.. వైరస్ కాటు వేస్తుందన్న భయంతో పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి లేదు. దీంతో వారు ఇంటికే పరిమితం అయిపోతూ ఆంక్షల మధ్య ఒత్తిడికి గురవుతున్నారు. ఏమాత్రం ఆటలు లేకపోవటం వల్ల కూడా వారిలో ఉత్సాహం తగ్గిపోతోంది. ఎవ్వరికీ ఏం చెప్పుకోలేక..ఏం చెప్పాలతో తెలీక ఒత్తిడికి గురై చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. పిల్లల్లో ఈ ఆకస్మిక ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు ..ఆన్లైన్ క్లాసుల చెప్పి ..పూర్తీ స్కూల్ ఫీజు కట్టాలంటూ మెస్సేజ్ లు పంపిస్తున్నారు. దీనిలో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.