• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరోసారి చిక్కుల్లో...

మరోసారి చిక్కుల్లో రవిప్రకాశ్.. ఇంట్లో సోదాలు.. అదుపులో అతడు

By - Tupaki Desk
Update: 2020-03-21 03:56 GMT
తెలుగు మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ తో ఒక వెలుగు వెలిగిపోయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు ఒకటి తర్వాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో సోదాల్ని నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లోని బీఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా ఉన్నట్లుగా గుర్తించారని చెబుతున్నారు.

 సుకేశ్ గుప్తా ఎందుకు రవిప్రకాశ్ ఇంట్లో తలదాచుకున్నాడు? అతడేం చేశాడు? అతని కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? అంటే.. మరో బడా ఆర్థిక అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లాలి. ఎస్ఆర్ఈఐ సంస్థ నుంచి సుకేశ్ గుప్తా.. నీతూ గుప్తాతోపాటు.. నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన ఇద్దరు కలిసి రూ.110 కోట్ల మొత్తాన్ని రుణంగా తసీుకున్నారు. ఈ డీల్ 2018 జూన్ లో జరిగింది.

ఈ భారీ మొత్తానికి సంబంధించిన వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించాలని.. నాలుగు వాయిదాల్లో రుణం.. వడ్డీ మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి ష్యురిటీ లేకుండా ఇవ్వరు కదా. అందుకు తగ్గట్లే.. హఫీజ్ పేటలో తనకున్న ఎనిమిది ఎకరాల స్థలాన్ని.. కింగ్ కోఠిలో ఉన్న 28,106 గజాల నజ్రీబాగ్ ప్యాలెస్ చూపించి డీల్ ఓకే చేసుకున్నారు.

అంతా అనుకున్నట్లే జరిగినా.. డీల్ లో భాగంగా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చేసరికి సుకేశ్ అండ్ కో ఫెయిల్ అయ్యింది. దీంతో.. గత డిసెంబరులో హఫీజ్ పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ రూ.102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు వీలుగా.. తమకు తనఖా పెట్టిన ప్యాలెస్ ను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. అనూహ్యంగా ఆ ప్యాలెస్ ను అప్పటికే ఐరిస్ హాస్పిటాలిటీస్ సంస్థకు అమ్మేసినట్లు గుర్తించారు. తమను మోసం చేసిన వైనం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో.. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా.. వీరు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించారు.  పక్కా సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. తాజాగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి..సుకేశ్ అండ్ కోను అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి మరో ఆర్థిక వివాదానికి సంబంధించిన ఇష్యూలో రవిప్రకాశ్ లింక్ కావటం.. ఆయన ఇల్లు నిందితులకు అడ్డాగా మారటం గమనార్హం. మరి.. దీని పై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో?
Tags:    
  • Once again Raviprakash is in trouble 
  • Tv9 ravi prakash Latest News 
  • Tv9 Ravi Prakash is in custody 
  • Latest Political News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS