దేశంలో కోటీశ్వరులు పెరిగారట!
భారత దేశం కూడా క్రమక్రమంగా ధనిక దేశంగా మారిపోతోందంట. మన దేశంలో ప్రతి ఏటా ట్యాక్స్ పేయర్లు పెరిగిపోతున్నారట. ఏటా కోటి అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారు ఎక్కువవుతున్నారట. ఆ కోటీశ్వరులంతా విధిగా పన్నులు కూడా చెల్లిస్తున్నారట. గత నాలుగేళ్ల కాలంలో ఆ తరహా కోటీశ్వరుల 1.40 లక్షలకు చేరిందట. ఈ విషయాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తాజాగా వెల్లడించింది. దాంతోపాటే, ఆదాయపు పన్నులు కట్టేవారి సంఖ్య కూడా 60శాతానికి పెరిగిందని సీబీడీటీ వెల్లడించింది. వీటితో పాటు, ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన కీలక గణాంకాలను సీబీడీటీ విడుదల చేసింది. కోటీశ్వరుల పన్నుల వల్ల ఆదాయపు పన్ను వసూళ్‌లలో 68 శాతం వృద్ధి నమోదైందని ఆ శాఖ వెల్లడించింది.
ఆదాయపు పన్ను చెల్లింపులపై గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు పన్ను కట్టే వారికి కొన్ని వెసులుబాటులు కూడా కల్పించింది. దీంతో, నల్లధనం కొంతవరకు తగ్గి...పన్నులు వసూలవుతున్నాయని కేంద్రం గతంలో చెప్పింది. ఇపుడు తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం కోటి రూపాయలకంటే ఎక్కువ సంపాదిస్తూ పన్ను కడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయిందని సీబీడీటీ వెల్లడించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 88,649 మంది వ్యక్తులు కోటి రూపాయలకు పైగా ఆదాయం రిటర్న్స్‌లో చూపించారట. ఇక, 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 1,40,139 మంది పన్ను కట్టారట. చట్టసభల నుంచి, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ సమాచారం సేకరించామని సీబీడీటీ ఛైర్మెన్ సుశీల్ చంద్ర తెలిపారు. గత నాలుగేళ్లలో ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య కూడా 80శాతం పెరిగిందని తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.79 కోట్ల మంది పన్ను కట్టగా...|2017-18 ఆర్థిక సంవత్సరంలో 6.85 కోట్ల మంది కట్టారు.