మంచంపై పడుకున్న రోగిని కొట్టి, తన్నిన వైద్యుడు.. షాకింగ్ వీడియో!

వైద్యో నారాయణో హరీ అంటారు. వైద్యులకు ఈ సమాజంలో అంత విలువ ఉంది.;

Update: 2025-12-23 03:55 GMT

వైద్యో నారాయణో హరీ అంటారు. వైద్యులకు ఈ సమాజంలో అంత విలువ ఉంది. ఈ క్రమంలో ఆ విలువను పాడుచేసే వైద్యులూ లేకపోలేదు! ఈ క్రమంలో వైద్యో నారాయణో హరీ అనే వాక్యాన్ని మరోలా అర్ధం చేసుకున్నాడో ఏమో కానీ ఓ దారుణానికి పాల్పడ్డాడు ఒక వైద్యుడు! ఇందులో భాగంగా... ఆస్పత్రి బెడ్ పై పడుకున్న రోగితో వాగ్వాదం అనంతరం.. అతన్ని విపరీతంగా కొట్టి, తన్నాడు.

అవును... హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటైన సిమ్లా లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ)లో ఒక వైద్యుడు చేసిన దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకిత్తిస్తోన్న ఈ వీడియోలో ఆస్పత్రి మంచంపై ఉన్న రోగిపై వైద్యుడు తీవ్రంగా దాడి చేసి, అతన్ని తీవ్రంగా గాయపరిచాడు!

ఐజీఎంసీలోని పల్మనరీ మెడిసిన్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ అయిన 31 ఏళ్ల డాక్టర్ రాఘవ్ నరులా.. అర్జున్ పన్వర్ గా చెబుతున్న 36 ఏళ్ల రోగిపై దాడి చేశారు. ఒక అటెండర్ చిత్రీకరించిన ఈ వీడియోలో ఈ విషయం వెల్లడైంది. ఈ సమయంలో రోగి తనను తాను రక్షించుకుంటూ మంచం మీద పడుకుని తన కాళ్లతో వైద్యుడిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వీడియోలో చూడవచ్చు.

ఈ దాడిలో పన్వర్ ముక్కు రక్తసిక్తమైంది. ఈ సందర్భంగా స్పందించిన రోగి కుటుంబ సభ్యులు... వైద్యుడు మొదట పవార్ తో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆ తర్వాత తీవ్ర వాగ్వాదానికి దిగాడని.. ఈ క్రమంలోనే అతనిపై తీవ్రంగా భౌతిక దాడి చేశాడని చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం.. నిందితుడైన వైద్యుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయని చెబుతున్నారు.

ఈ సందర్భంగా... రోగి కుటుంబ సభ్యులతో పాటు సహాయకులు సహా ఐజీఎంసీ వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఈ సందర్భంగా.. తక్షణమే వైద్యుడిని సస్పెండ్ చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో.. సీఎం సుఖ్వీందర్ సుఖు ఆదేశాల మేరకు ఇ సంఘటనపై దర్యాప్తు చేయడాన్నికి ఐజీఎంసీ పరిపాలన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఫలితాలను సమర్పించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం నిందితుడైన వైద్యుడిపై చర్యలు తీసుకుంటుందని చెబుతూ.. ఆ తదుపరి నోటీసు వచ్చే వరకూ అతన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించింది.

దీనిపై మరింత లోతూగా దర్యాప్తు చేయడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆరోగ్య మంత్రి ధని రామ్ శాండిల్... డాక్టర్ రాఘవ్ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అని, అతడు ఆగస్టు నుంచి ఐఇజీఎంసీ లో ఉన్నాడని తెలిపారు. అతనిది తప్పని తేలితే చర్యలు తప్పవని అన్నారు!



Tags:    

Similar News