అసోం ఎన్నార్సీ వెబ్ సైట్ నుండి అదృశ్యమైన డేటా..ఏమైందంటే!
ఎన్నార్సీ.. ప్రస్తుతం దేశంలో ఏ ఇద్దరు కలిసినా కూడా ఇదే విషయం పై మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్ ఆర్ సి , పౌరసత్వ సవరణ చట్టం పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అస్సాం ఎన్ఆర్సీ డేటా వెబ్ సైట్ నుంచి మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) వెబ్ సైట్ నుంచి అసోంకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ కు సంబంధించిన డేటా కనిపించడం లేదు.
అయితే , దీనిపై కేంద్ర హోంశాఖ అధికారులు వివరణ విచారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. మరోవైపు ఐటీ సంస్థతో కాంట్రాక్టును పునరుద్ధరించక పోవడంతో డేటా గల్లంతైందని ఎన్నార్సీ అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతేడాది ఆగస్టులో అసోం ఎన్నార్సీ డేటాను www.nrcassam.nic.in వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేశారు. దీని కోసం విప్రో క్లౌడ్ సర్వీస్ సేవలు అందించింది. అయితే క్లౌడ్ సేవల కోసం విప్రోతో చేసుకున్న ఒప్పందం గతేడాది అక్టోబరు 19తో ముగిసింది. ఆ తర్వాత విప్రో సంస్థ తన సేవలను నిలిపి వేసిందని ఎన్నార్సీ ప్రస్తుత కో-ఆర్డినేటర్ హితేశ్ దేవ్ శర్మ తెలిపారు. ఈ క్రమం లోనే గతేడాది డిసెంబరు 15 నుంచి వెబ్ సైట్ లో డేటా అందుబాటులో లేకుండా పోయింది అని తెలిపారు.
దీనిపై మాట్లాడిన ఎన్నార్సీ ప్రస్తుత కో-ఆర్డినేటర్ హితేశ్ దేవ్ శర్మ ... డిసెంబరు 24న తాను ఎన్నార్సీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టానని.. డేటా అదృశ్యమైన విషయం తెలియగానే సదరు ఐటీ సంస్థను సంప్రదించినట్లు తెలిపారు. ఒకసారి ఐటీ సంస్థ తన సేవలను పునరుద్ధరిస్తే.. తిరిగి ఎన్నార్సీ డేటా మళ్లీ వెబ్ సైట్ లో గతం లో మాదిరి కనిపిస్తుంది అని , అతి త్వరలో ఈ సమస్య కి పరిష్కారం అవుతుంది అని తెలిపారు.