కొత్త మార్పును గమనించారా? యూత్ కు హాట్ స్పాట్ గా తెలంగాణ రాజకీయం
ఒక పెద్ద మార్పు.. ఎలాంటి సందడి లేకుండా చాలా సింఫుల్ గా తెర మీదకు వచ్చేసింది. పాత.. కొత్తల మధ్య రాపిడి మామూలే. పాత నీరు వెళ్లి కొత్త నీరు వస్తున్నప్పుడు కాసింత హడావుడి తప్పదు. కానీ.. అందుకు భిన్నంగా ఈసారి ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే కొత్త నీరు గమ్మున వచ్చేసింది. కాకుంటే.. ఇదంతా ఒకే రోజు జరగటం.. ఈ రెండు కీలక పార్టీలుగా.. తెలంగాణ రాజ్యాధికారం మీద కన్నేసినవి కావటం విశేషం.
తెలంగాణ అధికారపక్షానికి సవాలు విసురుతూ.. ఏ మాత్రం అవకాశం లభించినా పవర్ ను సొంతం చేసుకోవటానికి కాంగ్రెస్.. బీజేపీలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. ఆ ఎత్తులు పారకుండా అడ్డుకునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా చోటు చేసుకున్న మార్పును ఊహించి కూడా ఉండరని చెప్పాలి. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన జులై ఏడుకు ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పాలి. ఒకే రోజున రెండు జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర పార్టీ నాయకత్వాలకు సరికొత్త దిశానిర్దేశం చేసేలా.. కొత్త అధికారకేంద్రాన్ని ఏర్పాటు చేసిన వైనం రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. పార్టీ అధినేత్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండానే.. పార్టీ చీఫ్ గా ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా చేసిన హడావుడి తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఊపును తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు పీసీసీ చీఫ్ లుగా వ్యవహరించారు. వారిద్దరూ చేయలేని పనిని రేవంత్ ఎంట్రీతోనే చేసేశారని చెప్పాలి.
ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పటం ద్వారా.. రాష్ట్ర కాంగ్రెస్ లోకి కొత్త నీరు వచ్చేసిందన్న స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్లైంది. అదే సమయంలో.. తనకు అధికారాన్ని అప్పజెప్పిన పార్టీ నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా.. ప్రమాణ స్వీకారోత్సవ వేళ చసిన సందడి అంతా ఇంతా కాదు. దీంతో.. పార్టీ అధినాయకత్వం సైతం సంతోషపడేలా నిన్నటి కార్యక్రమం జరిగిందన్నవాదన వినిపిస్తోంది.
ఓపక్క టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారణం చేశారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చెందిన కిషన్ రెడ్డి. వీరిద్దరి వయసు కాస్త తేడానే కానీ.. ఇద్దరు కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన వారే. ఇద్దరు మాటకారులే. ఇద్దరూ ఫైర్ బ్రాండ్ తీరును ప్రదర్శిస్తుంటారు. ఇప్పటివరకు మోడీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది. పర్యాటక శాఖను అప్పజెప్పారు. శాఖ ఏదైనా.. ఒక విషయం మాత్రం తాజా పరిణామాలతో స్పష్టమైనట్లే. తెలంగాణ బీజేపీ వరకు కిషన్ రెడ్డి లీడ్ రోల్ ప్లే చేస్తారని చెప్పక తప్పదు.
ఇక.. టీఆర్ఎస్ విషయానికి వస్తే.. కొత్త తరానికి పగ్గాలు అప్పజెప్పే ప్రయత్నం గడిచిన రెండేళ్లుగా కేసీఆర్ చేస్తున్నా ఫలించటం లేదు. ఈ ఏడాది మొదట్లో తన కుమారుడ్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఆయన ప్రయత్నించటమే కాదు.. అందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ.. ఆయన అనుకున్నది సాధ్యం కాలేదు. ఇటీవలకాలంలో కేసీఆర్ పాల్గొన్నకార్యక్రమాల్ని మినహాస్తే.. కేటీఆర్ పేరు మీదనే టీఆర్ఎస్ పార్టీ నడుస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇలా ఒకరి తర్వాత ఒకరు.. అన్ని పార్టీలు పాత తరానికి చెల్లుచీటి ఇచ్చేసి యూత్ కు పగ్గాలు అప్పజెప్పేయటం కనిపిస్తుంది. మరి.. కొత్త తరం నేతలతో తెలంగాణ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.