సంపదలోనే కాదు .. దానంలోను జెఫ్ బెజోస్ అగ్రస్థానం లోనే !

Update: 2021-01-05 13:10 GMT
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కేవలం సంపదలోనే కాదు, దాతృత్వ కార్యకలాపాల్లోను అందరికంటే కొంచెం ముందే ఉన్నారు. 2020 ఏడాదిలో చారిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన వారిలో బెజోస్ ముందున్నారు. గత ఏడాది వాతావరణ మార్పులపై పోరాటం కోసం 10 బిలియన్ డాలర్లు డొనేట్ చేశారు. 2020లో అతిపెద్ద డొనేేషన్ ఇది. క్రానికకల్ ఆఫ్ ఫిలాంత్రఫీస్ యాన్యువల్ లిస్ట్ ప్రకారం పోయిన సంవత్సరం బెజోస్ మొదటిస్థానం ‌లో నిలిచారు.

జెఫ్ బెజోస్ నికర ఆదాయం దాదాపు 188 బిలియన్ డాలర్లు. బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా అతను పెద్ద మొత్తంలో డొనేట్ చేస్తున్నారు. వాతావరణ సంక్షోభంలో చిక్కుకున్న లాభాపేక్షలేని సంస్థలకు బెజోస్ ఎర్త్ ఫండ్ మద్దతు ఇస్తోంది. ఎర్త్ ఫండ్ ద్వారా ఆయన ఇప్పటి వరకు 16 గ్రూప్స్‌కు 790 మిలియన్ డాలర్ల సహకారం అందించినట్లు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీస్ తెలిపింది. బెజోస్‌ ను మినహాయిస్తే టాప్ 10 వితరణలు 2011తో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం వితరణ 2.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ బిలియనీర్ల సంపద గత ఏడాది భారిగా పెరిగినప్పటికీ, విరాళాలు తగ్గాయని తెలిపింది. 2020 మార్చి 18 నుండి డిసెంబర్ 7 వరకు బెజోస్ సంపద 60 శాతం పెరిగింది.

వితరణలో బెజోస్ తర్వాత ఫిల్ నైట్, అతని భార్య ఉన్నారు. వీరిద్దరు రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఫిల్ నైట్ ఆదాయం గత ఏడాది మార్చి నుండి డిసెంబర్ మధ్య కాలంలో 77 శాతం పెరిగింది. నైట్, అతని భార్య 900 మిలియన్ డాలర్ల మేర దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించారు. దాతృత్వ కార్యకలాపాల కోసం నైట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి 250 మిలియన్ డాలర్లు ఇచ్చారు. HBE కార్పోరేషన్ కంపెనీ ఫౌండర్ ఫ్రెడ్ కుమ్మర్, అతని భార్య 300 మిలియన్ డాలర్లు దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించారు.
Tags:    

Similar News