ఉత్తరకొరియాకు కొత్త గండం..ఎడారి గుండా దేశంలోకి చైనా ఎల్లో డస్ట్

Update: 2020-10-25 13:30 GMT
కరోనా  మహమ్మారి అన్ని దేశాలను కుదిపేస్తున్నప్పటికీ ఉత్తర కొరియా మాత్రం సురక్షితంగానే ఉంది. ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ మీడియా పలుమార్లు వెల్లడించింది. గత  నవంబర్లో చైనాలో కరోనా  మహమ్మారి వ్యాప్తి మొదలవగానే సరి హద్దు దేశాలుగా ఉన్న ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా తన దేశ సరిహద్దుల్లో మూసేసింది. చైనా నుంచి ఏ ఒక్కరూ రాకుండా ఆటగాడు ఎవరు వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ ఆ దేశం నుంచి ఉత్తరకొరియా లోకి ప్రవేశించిన వారు ఒక్కరు కూడా లేకపోవడంతో ఆ దేశంలో కరోనా జాడ ఇప్పటి వరకూ  లేదు.

ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో ఆర్థికంగా చితికిపోయిన ఉత్తరకొరియా దేశంలోకి  కరోనా  మహమ్మారి ప్రవేశిస్తే మరింత సంక్షోభం చవిచూడాల్సి వస్తుందని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.  అయితే ఇప్పుడు ఉత్తర కొరియా ను మరో సమస్య వేధిస్తోంది. చైనా నుంచి వస్తున్న ఎల్లో డస్ట్ వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. చైనా,  మంగోలియా దేశాల్లోని ఎడారి ప్రాంతం నుంచి వచ్చే డస్ట్ ను  మంగోలియా  డస్ట్, ఆసియా డస్టు చైనా ఎల్లో డస్ట్ అని పిలుస్తుంటారు.

 ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఎల్లో  డస్ట్ లో ఆ దేశంలోని వివిధ రకాల రసాయన కర్మాగారం నుంచి వస్తున్న ప్రమాదకర వ్యర్థ పదార్థాలు గాల్లో కలిసి వేగంగా వస్తున్నాయి. ఈ వ్యర్థ పదార్థాల రాకతో ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశాలలో ఈ దుమ్ము ప్రభావం ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా కూడా కోవిడ్ సోకే అవకాశం ఉందని ప్రకటించే నేపథ్యంలో చైనా డస్ట్ గాలి వల్ల  తమ దేశంలో కూడా కరోనా  వ్యాప్తి మొదలవుతుందేమోనని  కొన్ని ఉత్తర కొరియా భయపడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రజలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఇళ్లలోంచి బయటకు రాకూడదని తలుపులు,  కిటికీలు మూసేసుకుని లోపలే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి వస్తే మాస్కు తప్పని సరి అని సూచించింది.
Tags:    

Similar News