బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు?

Update: 2022-01-03 08:30 GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘జాగరణ దీక్ష’ ఉద్రికత్తకు దారితీసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా బండి సంజయ్ చేపట్టిన ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.

ఓవైపు బండి సంజయ్ దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నేతలను , కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు నాటకీయ పరిణామాల మధ్య కార్యాలయం నుంచి బండి సంజయ్ ను కార్యకర్తలు తీసుకెళ్లారు. గేటుకు తాళం వేశారు. కార్యాలయంలో బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రాత్రి 10.30 గంటలకు తలుపులు, అద్దాలు పగులకొట్టి లోపలికి వెళ్లి సంజయ్ ను అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఇంతటి ఉద్రిక్తతకు కారణమైన బండి సంజయ్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్ ను రిమాండ్ కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ఉదయం 11 గంటలకు బండి సంజయ్ ను కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన.. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ పలు కేసులు బండి సంజయ్ పై నమోదు చేసే అవకాశం ఉంది.


Tags:    

Similar News