రైలు కోసం గంటన్నర ముందు వెళ్లాల్సిన అవసరం లేదట!

Update: 2020-10-24 17:30 GMT
కరోనా నేపథ్యంలో రైలు ప్రయాణానికి సంబంధించి సమూల మార్పులు తీసుకురావటం తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం పరిమితంగా నడుపుతున్న రైళ్లలో ప్రయాణించాలంటే.. కనీసం గంటన్నర ముందు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సి ఉండేది. అంతేకాదు.. స్టేషన్ లోకి గతంలో మాదిరి అందరిని అనుమతించకుండా.. కేవలం ప్రయాణికుల్ని మాత్రమే లోపలకు పంపుతున్నారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు మొదలు ఎవరికి ప్రయాణికుల వెంట లోపలకు అనుమతించని పరిస్థితి.

దీంతో.. హైదరాబాద్ మహానగరంలో రైలు ప్రయాణం అంటే.. చాలా సమయం తీసుకొంటోంది. మధ్యాహ్నం ఐదు గంటలకు ట్రైన్ అంటే.. ఇంట్లో నుంచి కనీసం ఒంటి గంటకు బయలుదేరాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రైలు ప్రయాణ సమయానికి గంటన్నర ముందు వచ్చే నిబంధన స్థానే.. అరగంట ముందు వస్తే సరిపోతుందన్న అనధికార నియమాన్ని తీసుకొచ్చారు. లేజర్ టెక్నాలజీ సాయంతో ఆధునిక థర్మల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేయటంతో కొత్త విధానాన్ని అనధికారికంగా షురూ చేస్తున్నట్లు చెబుతున్నారు.

దీంతో.. ప్రయాణ సమయానికి గంటన్నర ముందు స్థానే.. అరగంట ముందు వచ్చినా సరిపోతోంది. కరోనా నేపథ్యంలో తీసుకొచ్చిన ఇతర నిబంధనల్ని యథాతధంగా అమలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లోకి ఎవరిని అనుమతించకపోవటం.. లగేజ్ ఉంటే.. కూలీల సాయంతో లోపలకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. గతానికి భిన్నంగా స్టేషన్ లోనూ.. రైళ్లలోనూ మంచినీళ్ల బాటిళ్లు.. టిఫిన్లు.. చిరుతిండ్లను అమ్మటంపై అనుసరిస్తున్న నియంత్రణను కొనసాగిస్తున్నారు. రైళ్లను.. ఫ్లాట్ ఫారాల్ని ఎప్పటిలానే శానిటైజ్ చేస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన మార్పు.. అనధికారమేనని చెబుతున్నారు.
Tags:    

Similar News