ప్రజలు, మీడియా.. ఏపీ పాలిటిక్స్ కథ..

Update: 2019-05-25 04:22 GMT
మీడియా పవర్ ఎంత..? రాజకీయాలను శాసించగలవా.? తమకు ఇష్టమైన నాయకుడిని గద్దెనెక్కించగలవా.? అంటే కొంతవరకు నిజమే.. కానీ అన్ని వేళలా అది సాధ్యంకాదు.. ప్రజల కళ్లకు గంతలు కట్టడం మీడియా వల్ల కాదని చాలా సార్లు నిరూపితమైంది.
 
అవి ఎన్టీఆర్ దిగిపోయే రోజులు.. ఆయన ఎంత పాలించినా.. ఎంత సంక్షేమ పథకాలు అమలు చేసినా.. లక్ష్మీపార్వతి అన్న బూచీని చూపి ఎన్టీఆర్ పై నాటి టీడీపీ అనుకూల మీడియా బురద జల్లింది. చంద్రబాబు ప్రోద్బలంతో ఓ మీడియా గురువు తనపత్రికతో ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేయడంలో కీలకంగా వ్యవహరించారని నాటి పరిస్థితులను దగ్గరుండి చూసిన వారు ఇప్పటికీ చెబుతుంటారు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లోనూ ఎన్టీఆర్ ను దించడానికి బాబు చేసిన కుట్రల్లో మీడియా పవర్ ఎంతనేది క్లియర్ గా చూపించారు.

2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. వైఎస్ ఐదేళ్లు పాలించారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. కానీ చంద్రబాబు, పచ్చ మీడియా వైఎస్ పై పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశారు. ‘రెడ్డిగారి లీలలు’ అంటూ పెద్ద ఎత్తున  వైఎస్ ను దించేందుకు.. టీడీపీని గద్దెదించేందుకు విస్తృత ప్రచారం చేశారు. ఆ రెండు పత్రికలు నన్ను టార్గెట్ చేశాయని స్వయంగా వైఎస్ అసెంబ్లీలోనే ఆడిపోసుకున్నారు. కానీ నాడు ప్రజలు తమకు మేలు చేసిన వైఎస్ నే గెలిపించారు.

2014 సార్వత్రిక ఎన్నికల వేళ.. మీడియా అంతా మోడీని నమ్మి ఆయనకు విస్తృత ప్రచారం చేశాయి. ఆయన గద్దెనెక్కడంలో దోహదపడ్డాయి. ఇక 2014లోనే జగన్ గెలిచి సీఎం కావాల్సింది.. కానీ టీడీపీ-బీజేపీ జట్టుకట్టడం.. రాజధాని కూడా లేని రాష్ట్రం అని టీడీపీ మీడియా చేసిన ప్రచారాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు సీనియారిటీ అవసరమని నానా యాగా చేశారు. జగన్ కు దక్కాల్సిన అధికారాన్ని ప్రజలను డైవర్ట్ చేసి బాబుకు కట్టబెట్టారు..

ఇప్పుడు 2019.. ఇప్పుడు కూడా జగన్ కు అధికారం చేతకాదని.. విభాజిత ఏపీని అభివృద్ధి చేయాలంటే బాబే కావాలంటూ టీడీపీ అనుకూల మీడియా చేసిన హంగామా రచ్చ, విషప్రచారం చేశారు. ఎంత చేసినా.. ప్రజలు మాత్రం ఈసారి  మీడియా పిచ్చి రాతలు నమ్మలేదు. మనసుతో ఆలోచించారు.. జగన్ నే గెలిపించారు. బలమైన టీడీపీ మీడియా లాబీయింగ్ ను పక్కనపెట్టేసి.. జగన్ నిజాయితీని నమ్మి ఓటేశారు.

 ఇలా మీడియాను ధీటుగా ఎదుర్కొని తండ్రీకొడుకులు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నేడు జగన్ ఏపీ లో విజేతగా నిలిచారు. దీన్ని బట్టి ప్రజాబలం ముందు మీడియా ప్రచారం ఉత్తదే అని.. నిజాయితీ గల నాయకులను గెలిపించడంలో ప్రజలు ముందుంటారని తేటతెల్లమైంది. మీడియా క్రియాశీలత అన్ని వేళలా పనికిరాదని స్పష్టమైంది.  మీడియా వ్యతిరేకతను ఎదుర్కొని నిలబడ్డ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ నిలిచారు.
Tags:    

Similar News