ఇండియాలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి లేదు

Update: 2020-03-21 01:30 GMT
ప్రపంచదేశాలతో పాటు భారత్‌ ను కరోనా వణికిస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వారితో ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 223కి పెరిగాయి. మృతులు నాలుగుకు చేరుకున్నాయి. ఈ మహమ్మారి పట్ల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సూచనలు - ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ ఆందోళనకరమే.

ప్రస్తుతం భారత్ షట్ డౌన్ అయింది. థియేటర్లు - విద్యా సంస్థలు - ప్రత్యేక రైలు సర్వీసులు - అంతర్జాతీయ విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసివేసింది భారత ప్రభుత్వం. ఇండియాలో కమ్యూనిటీ వ్యాప్తి లేదని భారత కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. కోవిడ్ 19 వ్యాధి మన దేశంలో సామాజిక వ్యాప్తి జరగలేదని, అన్ని నమూనా పరీక్షల్లోను నెగిటివ్ ఫలితాలు వచ్చాయని వెల్లడించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దేశంలో కమ్యూనిటీ ట్రాన్సుమిషఖన్ అవుతున్నట్లు ఆధారాల్లేవని చెప్పింది.

ఈ మహమ్మారి కమ్యూనిటీ ద్వారా వ్యాప్తించడం లేదని - ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ అన్నారు. కమ్యూనిటీ వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు 820 శాంపిల్స్ సేకరించామని - అత్యంత తీవ్ర శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ కోసం పరీక్షించిన అన్ని రాండం శాంపిల్స్‌ లోను కరోనా నెగిటివ్ తేలిందన్నారు. తద్వారా కమ్యూనిటీ వ్యాప్తి లేదని తెలుస్తోందన్నారు. గత ముప్పై రోజుల కాలంలో ఎక్కడా కమ్యూనిటీ వ్యాప్తి లేదని - భారత్ స్టేజ్ 4లోకి వెళ్తోందని, ఇప్పటి వరకు ఈ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న చైనా - ఇటలీ - ఇరాన్ దేశాలన్నీ నాలుగో దశను దాటేశాయన్నారు.


Tags:    

Similar News