ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్న నివర్ తుఫాన్..ఆ 8 జిల్లాల్లో హై అలర్ట్!
నివర్ తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టిస్తుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని భారీ వర్షానికి 8 జిల్లాలు వణికిపోతున్నాయి. భారీ వర్షాల దెబ్బకి జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు నీటిలో మునిగిపోతుండగా , ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఈ తుపాన్ ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది.. ఈదురుగాలులు, భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. తిరుపతి సహా తూర్పు మండలాల్లో పెద్దఎత్తున నీరు చేరింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో వరద పారింది. వర్షం కారణంగా శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు.
తిరుమలోని పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార, ఆకాశగంగ డ్యామ్‌లు పూర్తిగా నిండి నీరు పొంగి పొర్లుతోంది. శ్రీవారి మెట్ల మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేసింది. చిత్తూరులోనూ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద చెన్నారెడ్డికాలనీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు బయటకు రాలేకపోగా ఎన్డీఆర్ ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నెల్లూరు పై కూడా ఈ తుపాన్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గూడూరు, మనుబోలు మధ్యలో ఆదిశంకర కాలేజీ దగ్గర చెన్నై-కోల్ కత జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అనిల్ కుమార్ అధికారులతో సమీక్ష చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి.
కడప జిల్లాను తుఫాన్ వణికించింది. రాయచోటి - రాజంపేట - రైల్వేకోడూరు - బద్వేలు - కమలాపురం నియోజకవర్గాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వేల ఎకరాల్లో వరి పంట మునిగిపోయింది. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇటు ప్రకాశం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానలతో జనజీవనం స్తంభించింది. అలాగే ప్రకాశం , గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. కృష్ణా జిల్లాలోనూ వర్షాలకు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలుగింది. అవనిగడ్డ - మచిలీపట్నం - మోపిదేవి - గుడివాడ - కైకలూరు - నాగాయలంక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. మొత్తంగా రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఈ నివర్ తుపాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.