‘‘కన్నడదల్లే ప్రశ్న కేళి’’ అంటూ షాకిచ్చిన నిర్మల

Update: 2016-06-01 04:30 GMT
తెలుగింటి కోడలుగా సుపరిచితురాలైన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్.. కన్నడ మీడియాకు చిన్నాపాటి షాకిచ్చారు. తాజాగా రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా.. కర్ణాటక నుంచి బరిలోకి దిగితున్న ఆమె.. మంగళవారం తన నామినేషన్ ను సమర్పించారు. ఈ సందర్భంగా బెంగళూరుకు వెళ్లిన ఆమె.. తన నామినేషన్ కార్యక్రమం పూర్తి అయ్యాక.. అక్కడి మీడియాను ఉద్దేశించి.. ‘‘కన్నడదల్లే ప్రశ్న కేళి.. ననగెకన్నడ అర్థవాగుత్తదే’’ అన్న మాటలతో ఆశ్చర్యపరిచారు. కన్నడంలో ఆమె చెప్పిన మాటలకు అర్థం ఏమిటంటే.. కన్నడలోనే ప్రశ్న అడగండి.. నాకు అర్థమవుతుందని.

ఇంగ్లిషు.. హిందీ.. తెలుగులో దంచిపారేసే నిర్మలమ్మలో కన్నడ యాంగిల్ ను అస్సలు ఊహించని అక్కడి మీడియా సర్ ప్రైజ్ కు గురైంది. తనకు కన్నడ పూర్తిగా అర్థమవుతుందని.. కానీ మాట్లాడలేదని.. వచ్చేసారి వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులతో కన్నడంలోనే మాట్లాడతానంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి తన నామినేషన్ సందర్భంగా తనలోని కన్నడ కోణాన్ని ఆవిష్కరించి ఆకట్టుకున్నారనే చెప్పాలి. పార్లమెంటులో కర్నాటక ప్రతినిధిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడతానని చెప్పిన నిర్మలమ్మ మాట విన్న వెంటనే సీమాంధ్రులకు కలిగే సందేహం ఒక్కటే. ఇంతకాలం ఏపీ రాజ్యసభ సభ్యురాలిగా సీమాంధ్రకు ఏం చేశారో చెబితే బాగుంటుందేమో..?
Tags:    

Similar News