• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్థానిక పోరు ముగియగానే...

స్థానిక పోరు ముగియగానే మరో ఎన్నికకి సిద్దమౌతున్న నిమ్మగడ్డ !?

By - Tupaki Desk
Update: 2021-01-27 15:30 GMT
ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకి మరో రెండు రోజుల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి సన్నాహాలు ముగింపు దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో మరో సంగ్రామానికి తెర లేవబోతుంది అంటూ కొన్ని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.  లోకల్ బాడీ ఎలక్షన్స్ ముగియగానే  వచ్చేనెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నోటిఫికేషన్ వెలువడుతుందని  పలువురు చర్చించుకుంటున్నారు.

ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన రీషెడ్యూల్ ప్రకారం.. వచ్చే నెల 21వ తేదీన పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ముగుస్తుంది. 9వ తేదీన ఆరంభం అయ్యి పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగు విడతల్లో అంటే.. 13, 17, 21 తేదీలతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజే మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్, షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. రెండు లేదా మూడు విడతల్లో ఈ ఎన్నికలు ముగిసేలా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్తున్నారు.

గత ఏడాది మార్చిలోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్పప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కారణంగా వాటిని వాయిదా వేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మున్సిపాలిటీలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టి సారిస్తారని, 22వ తేదీ నాడే ఎన్నిలకను నిర్వహించే విధంగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందంటూ అంటున్నారు.

మార్చి నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. దీనితో తన పదవీ కాలం ముగిసేలోపు  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 77 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు ఉన్నాయి. 31 నగర పంచాయతీలు ఉన్నాయి. 75 మున్సిపాలిటీల్లో ఆరు సెలెక్షన్ స్పెషల్ గ్రేడ్, ఏడు స్పెషల్ గ్రేడ్, 16 ఫస్ట్ గ్రేడ్, 30 సెకెండ్ గ్రేడ్, 20 థర్డ్ గ్రేడ్ కేటగిరీకి చెందినవి.

మొత్తం 104 మున్సిపాలిటీలు ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల 29 చోట్ల ఎన్నికలను నిర్వహించకపోవచ్చు. పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కారణాల వల్ల ఆయా మున్సిపాలిటీల్లో ఆలస్యంగా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకపోవచ్చని అంటున్నారు. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరపాలా ,లేక మరోసారి ఎన్నికలు జరపాలా అనేది ఖరారు కాలేదని తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యేకంగా ఎన్నికలను నిర్వహించడానికి మొగ్గు చూపొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అతి త్వరలో ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Tags:    
  • Nimmagadda Ramesh Kumar 
  • Latest News 
  • AP Politics 
  • Telugu News 
  • Tupaki Updates 
  • Political Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS