ముగిసిన NIA సోదాలు .. విచారణకి పిలుపు !
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పలువురి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. విరసం , పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఎన్ ఐఏ సోదాలు చేసింది. కడప, పొద్దుటూరులో విరసం మాజీ కార్యదర్శి వరలక్ష్మీ ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. అలాగే , హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఉన్న ప్రముఖ అడ్వకేట్ రఘునాథ్ ఇంట్లో కూడా ఎన్ ఐ ఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమాకొరెగావ్ కేసుకు సంబంధించి విరసం నేతల ఇళ్లలో ఎన్ ఐఏ సోదాలు నిర్వహించింది. అలాగే డప్పు రమేష్ ఇంటిపై కూడా ఎన్ ఐఏ దాడులు జరిపింది. అలాగే, కర్నూలులోని అరోర నగర్లో విప్లవ రచయిత అయిన పినాకపాణి నివాసంలో కూడా ఎన్ ఐ ఏ సోదాలు జరిగాయి.
నక్సల్స్ తో సత్సంబందాలు ఉన్నాయనే కోణంలో ఎన్ ఐ ఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఈ ఇళ్ల సోదాల్లో పలు కీలక పుస్తకాలు, పత్రాలు, ల్యాప్ ట్యాప్ లు, సీడీలు, పెన్ డ్రైవులు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుండి మొదలైన ఈ సోదాలు కొద్ది సేపటి క్రితమే ముగిసాయి. అలాగే వారందరికీ విచారణ కోసం హైదరాబాద్ లో మాదాపూర్ లో ఉన్న తమ ఆఫీస్ కి రావాలని నోటీసులు జారీచేశారు.