రోడ్ల పాప‌మంతా ప్రతిపక్షాలదేనా రాజా...?

Update: 2022-10-12 14:58 GMT
ఏపీలో రోడ్ల సొగసు చూడు నరకానికే డైరెక్ట్ రూట్ అని పాటలు కూడా కడుతున్నారు సోషల్ మీడియాలో. రోడ్లు అని చెప్పుకునే రోజులు పోయి రెండేళ్ళు గడచిపోయాయి. ఇపుడు పాడైన రోడ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. రోడ్డు అనుకుని వెళ్తే గంతలు పడిపోయి  పాతాళం వైపు  దారులు చూపిస్తున్నాయి. ఆ మీదట అడ్రస్ లేకుండానే పైకి వెళ్ళిపోతున్నారు జనాలు.

దాంతో ఏపీ రోడ్లకు కిల్లర్ రోడ్స్ అని పేరు కూడా పెట్టేసింది టీడీపీ అనుకూల మీడియా. ఇలాంటి రోడ్ల మీదకు వస్తే చావే వెతుక్కుంటూ వస్తుందని టీడీపీ అనుకూల మీడియా ఒక్క లెక్కన  ఏకి పారస్తోంది. ఏపీలో ఉన్న పాడైన రోడ్లను ఫోటోలు తీసి మరీ ప్రింట్ చేసి పెడుతోంది. దీంతో ఈ విమర్శలను తట్టుకోవడం వైసీపీ సర్కార్ వల్ల కావడంలేదు.

మరి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా వారికి ఎలా వీలు అవుతుంది. అందుకే ఆయన తనదైన శైలిలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. రోడ్లు అలా బొక్కల మయం కావడానికి విపక్షాలే కారణమని భారీ ఆరోపణ చేశారు. విపక్షాలే కావాలని రోడ్లను తవ్వేస్తూ గుంతలు పెడుతూ వాటిని మళ్లీ ఫోటలు తీసి ప్రచారం చేస్తున్నారు అని ఆయన కొత్త వింత ఆరోపణ చేశారు.

ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికే చేస్తున్నారు అని రాజా వారు బండ ఒకటి వేశారు. మరో వైపు మంచి రోడ్లు ఏపీలో ఎన్నో ఉన్నా విపక్షానికి అసలు ఎక్కడా కనిపించడంలేదని కూడా అన్నారు. ఉన్న రోడ్లను తవ్వేస్తూ పాడు చేస్తూంటే ప్రభుత్వం ఎలా బాగుచేయగలదు అని ధర్మ సందేహం వ్యక్తం చేశారు.

ఇలా చేస్తూ పోతూంటే ఎంతమంది మీద కేసులు పెడతామని ఆయన చింతిస్తున్నారు. దీనిని బట్టి అర్ధమయ్యేది ఏంటి అంటే అసలు మంత్రి గారి వద్ద విపక్షాలు రోడ్లను పాడుచేసినట్లుగా ఎక్కడా ఆధారాలు లేవు అనే అంటున్నారు. అందుకే ఆయన కావాలనే బండ వేస్తూ వారి మీద ప్రతి విమర్శలు చేస్తున్నారు అని అంటున్నరు. ఏది ఏమైనా రోడ్లు ఎందుకు బాగు లేవు అంటే విపక్షం వాటిని పాడుచేయడం వల్ల అని చక్కని జవాబు మంత్రి గారి దగ్గర ఉందని సెటైర్లు  పేల్తున్నాయి. ఎంతైనా రాజా వారు కదా అలాగే ఉంటుంది మరి తమాషా అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News