వైసీపీని భయపెడుతున్న నాలుగు సీట్లు....?
వైసీపీ అధినాయకత్వం టోటల్ ఏపీ అంతా మాదే అంటోంది. 175కి 175 సీట్లు గెలిచి తీరుతామని ధీమా పడుతోంది. అయితే జిల్లాల వారీగా చూస్తే చాలా చోట్ల అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. దాంతో అక్కడ నేతలకు వైసీపీ ఫ్యాన్ ఎలా తిరుగుతోందో బాగా అర్ధమవుతోంది. అది అంతకంతకు నెమ్మదిస్తోంది తప్ప స్పీడ్ అయితే పెరగడం లేదు అంటున్నారు.
ఉత్తరాంధ్రా మీద వైసీపీ ఫోకస్ పెట్టింది, మళ్లీ 2019 నాటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుంది అని ఆ పార్టీ వారు చెబుతూ ఉంటారు. కానీ అదే ఉత్తరాంధ్రా టీడీపీకి కంచుకోట. ఒక ఎన్నికతో అది బద్ధలయ్యేది కాదు, ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జోరు ఎపుడూ తగ్గలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం టోటల్ పది సీట్లకు గానూ రెండు మాత్రమే ఆ పార్టీ పరం అయ్యాయి.
కానీ ఈసారి మెజారిటీ సీట్లు మావే అని టీడీపీ జబ్బలు చరుస్తోంది. దానికి అనుగుణంగానే అధికార పార్టీ అభ్యర్ధులకు కొన్ని సీట్లలో ఎదురీత తప్పడంలేదు అని అంటున్నారు. అలాంటి సీట్లలో స్పీకర్ తమ్మినేని సీతారాం సీటు ఆముదాలవలస ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ సీతారాం సొంత మేనల్లుడు టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ కూన రవికుమార్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా సీటు ఎగరేసుకుపోవడానికి ఆయన రెడీగా ఉన్నారు.
ఇక్కడ వైసీపీ వీక్ అవుతోంది. దానికి తోడు రెండు వర్గాలు బలంగా పనిచేస్తున్నాయి. ఈ పరిణామాలతో సర్వేలు సైతం వైసీపీ పెద్దలకు చేదు నిజాలనే వినిపిస్తున్నాయట. ఇక మరో సీటు పాతపట్నం. ఇక్కడ రెడ్డి శాంతి వైసీపీ ఎమ్మెల్యే. ఆమె ఎక్కువగా ఢిల్లీలో ఉంటారు. పక్కా నాన్ లోకల్ అని చెబుతున్నారు. సొంత పార్టీలోనే ఆమె పట్ల సానుకూలత లేదు అని చెబుతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీటు ఒక్కటీ పాతపట్నంలోనే కావడం ఒక విశేషం అయితే ఆ సీటును పోగొట్టుకున్నది కూడా రెడ్డి శాంతి కుమారుడు పోటీ చేసి ఓటమిని అందుకుని అన్నది ఇక్కడ చెప్పాలి.
దాంతో సర్వేలు కూడా ఈ సీటు వైసీపీది కాదు అనేస్తున్నాయి. ఇక్కడ కూడా టీడీపీకి గట్టి నాయకత్వం ఉంది. కలమట ఫ్యామిలీకి ఇది పెట్టింది పేరుగా ఉన్న సీటు. దాంతో మరోసారి ఆ ఫ్యామిలీ జెండా ఎగరేస్తుందా అన్న చర్చ అయితే మొదలైంది అంటున్నారు. ఇక మరో సీటు చూస్తే హాట్ హాట్ ఎచ్చెర్ల. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ కి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎక్కువ. ఆయన మా వూరు రావద్దు అని చెప్పేది ప్రతిపక్షం కాదు, స్వపక్షమే ఆ మాట చెప్పి గ్రామం పొలిమేరల్లో అడ్డుకుంటూ వస్తోంది.
గొర్లెకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని చెబుతోంది కూడా విపక్షం కాదు, ఏ రకమైన సర్వే కాదు సొంత పార్టీలో ఆయన్ని వ్యతిరేకించే వారే. ప్రస్తుతం వారి బలం బాగానే ఉంది. ఈ పోరులో పూర్తిగా నలిగిపోతోంది నియోజకవర్గం పార్టీ. ఈ సీటుని వైసీపీ 2019 ఎన్నికల్లో 18,711 ఓట్ల భారీ మెజారిటీతో గెలుచుకుంది. ఇక ఓడించింది ఎవరినో కాదు ఆనాటి టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ కమ్ మినిస్టర్ అయిన కళా వెంకటరావుని.
అంతటి బహుళ ప్రజాదరణ ఇక్కడ దక్కించుకున్న వైసీపీకి ఇపుడు గడ్డు పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయట. అందులో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యవహార శైలి అని చెబుతున్నారు. సో ఈ సీటు విషయంలో కూడా పార్టీ బెంగ పడుతోంది అని అంటున్నారు. ఇక చివరాఖరున ఒక సీటు చెప్పాలి. అదే టెక్కలి. ఈ సీటు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడిది. ఆయన 2014 నుంచి వరసగా రెండు సార్లు గెలిచారు. అంతకు ముందు అచ్చెన్న ప్రాతినిధ్యం వహించిన హరిశ్చంద్రపురం మండలాలు ఆ బలాలు అన్నీ కూడా 2008 తరువాత బైఫరికేట్ చేసిన టెక్కలిలో కలసి ఆయనకు విజయాన్ని అందిస్తున్నాయి.
పార్టీ పెట్టాక పోటీ చేశాక వైసీపీ టెక్కలిలో గెలిచింది లేదు. పైగా అక్కడ అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన్ని ఓడించాలని వైసీపీ హై కమాండ్ కి గట్టి పట్టుదల ఉంది. కానీ టెక్కలి వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఒక దాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను లీడ్ చేస్తూంటే మరోదానికి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారణి నాయకత్వం వహిస్తున్నారు. మూడవ గ్రూపు కి పేడాడ తిలక్ ఆజ్యం పోస్తున్నారు.
ఇలా పార్టీ మూడు ముక్కలాడుతూంటే టీడీపీ చెక్కుచెదరని బలంతో ఉంది. దాంతో ఈ సీట్లో కూడా 2024 ఎన్నికల్లో ఫుల్ గా ఆశలు వదిలేసుకోవచ్చు అని అంటున్నారుట. మొత్తానికి ఎపుడు ఎన్నికలు జరినా శ్రీకాకుళం జిల్లాలో ఈ సీట్లకు ఈజీగా ఆశలు వదిలేసుకోవచ్చు అని సర్వేలు అంటున్నాయట. అయితే హై కమాండ్ రిపేర్లు చేసి అభ్యర్ధులను బలంగా చేయడమో లేక మార్చడమో చేస్తే రిజల్ట్ లో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.