కొత్తగా ట్రై చేసిన బాబు: సజ్జల కథనం.. జగన్ దర్శకత్వం.. డీజీపీ నటన!
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ రాజకీయ అధినేతగా తనకు తానుగా గొప్పలు చెప్పే చంద్రబాబు.. కొన్ని విషయాల్లో మాత్రం ఆయన ఇప్పటికి మెరుగుపడలేదని చెప్పాలి. రాజకీయంగా ఎప్పుడేం మాట్లాడాలి? ఎప్పుడు ఏ అంశాల్ని ప్రస్తావించాలి? ఎంత ఘాటుగా రియాక్టు కావాలి? అందుకు అవసరమైన మసాలా మాటల్ని సిద్ధం చేసుకునే విషయంలో బాబు ఎప్పుడు తప్పు చేస్తుంటారని చెబుతారు.
రోటీన్ కు భిన్నంగా.. తన మాటల్ని కాస్త మార్చారు చంద్రబాబు. తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏపీలోని ఆలయాల ధ్వంసంపై టీడీపీ.. బీజేపీ నేతల హస్తం ఉందన్న ఏపీ డీజీపీ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్ప పట్టారు. విధ్వంసాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కేసులు ఎందుకు లేవని ప్రశ్నించారు. అన్యమత ప్రచారాలు.. బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నది ఎవరన్న చంద్రబాబు.. సజ్జల కథనం.. జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నారన్నారు.
ఆలయాలపై 150 దాడులు.. విగ్రహ ధ్వంసాలు జరిగే వరకు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించటం.. ఆ ఘటనలకు రాజకీయాలకు సంబంధం లేదని భోగి రోజున డీజీపీ చెప్పారన్నారు. మళ్లీ కనుమ రోజున మాట మార్చి ప్రతిపక్షాలకు అంటగట్టటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలపై తిరుపతి ఉప ఎన్నిక తొలి పరీక్ష కావాలని.. ప్రజలకు ఇదో చక్కటి అవకాశమన్నారు. అధికారపార్టీని ఓడించటం ద్వారా చరిత్రమాత్మక తీర్పునకు తిరుపతి వేదిక కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరి.. బాబు మాటల్ని తిరుపతి ఓటర్లు ఎంతవరకు వంట బట్టించుకుంటారో చూడాలి.