చైనాలో కొత్తగా 996 ఉద్యమం

Update: 2021-10-16 05:37 GMT
చైనాలో కొత్తగా 996 ఉద్యమం ఊపందుకుంటోంది. ఒకవైపు అమెరికా, యూరోపు దేశాల్లో ది గ్రేట్ రిజిగ్నేషన్ ఉద్యమం ఊపందుకుంటుంటే చైనాలో 996 ఉద్యమం జోరందుకోవటం గమనార్హం. ఇంతకీ 996 ఉద్యమం అంటే ఏమిటనే సందేహం మొదలైందా ? 996 ఉద్యమం అంటే ఏమిటంటే ఇది ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన పనివేళలు, పనిదినాలను సూచించేది. 996 అంటే ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటలవరకు పనిగంటలని  మొదటి 99కి అర్ధం.

అలాగే 996లో చివరి 6కి అర్ధమేమిటంటే వారానికి పనిచేసే దినాలు. అంటే వారానికి 6 రోజుల పనిదినాలను కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా ఉద్యోగులుగా, కార్మికులుగా పనిలోకి చేరేటపుడు వారి పనిగంటలు రోజుకు 8 గంటలు మాత్రమే ఉంటుందని, వారానికి 5 రోజులే అని రికార్డుల్లో ఉంటాయట. కానీ క్షేత్రస్ధాయిలో జరిగేదేమిటంటే రోజుకు 10-12 గంటలు పనిచేయించుకుంటున్నాయట యాజమాన్యాలు. ప్రభుత్వ ఆఫీసులైనా అంతే ప్రైవేటు కంపెనీలు అయినా ఒకటే పద్దతట.

అలాగే వారానికి 5 రోజలు మాత్రమే పనిచేయాలని రికార్డుల్లో ఉన్నప్పటికీ వాస్తవంగా 6 రోజులు పని చేయించుకుంటున్నారట. నిబంధనలకు విరుద్ధంగా తమతో పనిచేయించుకుంటున్న విషయాన్ని ప్రభుత్వంతో అయినా యాజమాన్యాలతో అయినా చెప్పుకున్నా ఉపయోగం కనబడలేదట. దాంతో ఏమి చేయాలో అర్ధంకాని ఉద్యోగులు చివరకు ఆన్ లైన్లో పైన చెప్పుకన్న 996 ఉద్యమాన్ని మొదలుపెట్టారట.

996 ఉద్యమంలోకి ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగులు సభ్యులుగా చేరిపోయారట. చూడబోతే ఈ 996 ఆన్ లైన్ ఉద్యమంలోకి లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు సభ్యులుగా చేరేట్లే ఉన్నారు. 996 స్ధానంలో 955 అమల్లోకి రావాలంటు ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు. 955 అంటే ఏమిటంటే ఆఫీసు అయినా, ఫ్యాక్టరీ అయినా పనివేళలు  ఉదయం 9  గంటల నుండి సాయంత్రం 5 వరకే ఉండాలట. అలాగే చివరి 5 దేనికి సంకేతమంటే వారానికి 5 రోజులే పని చేయించుకోవాలట.

నిజానికి చైనాలో ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. యావత్ ప్రపంచదేశాల్లో కార్మికుల నియమ, నిబంధనలు ఒక విధంగా ఉంటే చైనాలో మాత్రం మరోరకంగా ఉంటాయి. పేరుకు కార్మికచట్టాలు నియమ, నిబంధనలున్నా అంతిమంగా ప్రభుత్వం చెప్పిందే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చేయాలని ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. ఒకటి రెండు రోజల తర్వత సదరు శాల్తీ ఎవరికీ కనిపించకండా పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదట. మరిలాంటి దేశంలో కొత్తగా మొదలైన 996 ఆన్ లైన్ ఉద్యమం ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాల్సిందే.
Tags:    

Similar News