మీ దగ్గర డబ్బులున్నాయా? కరోనాకు దూరంగా వెళ్లిపోవచ్చు
ప్రపంచాన్ని వెంటాడి వేధిస్తున్న కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే వీలుందా? ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో అక్కడ కరోనా అంటుకుంటుందన్న భయాందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలాంటప్పుడు సురక్షితమైన మార్గం ఏమిటి? అంటే.. ఏమీ లేదనే చెబుతున్నారు. వీలైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించటం.. శానిటైజ్ లు వినియోగించటం.. సీ.. డీ.. జింకోవిట్ లాంటి మందుల్ని తీసుకోవటం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం చేస్తున్నారు. బయటకు వెళితే ముఖానికి మాస్కు పెట్టుకోవటం.. మంచి ఆహారం తీసుకోవటం లాంటివి చేస్తున్నారు. అయినప్పటికి కరోనా రాదన్న గ్యారెంటీ ఉందా? అంటే లేదనే చెప్పాలి.
అందుకే.. కరోనా మాట వినపడకుండా ఉండటం ఎలా అన్న ఆలోచన సంపన్నుల్ని తొలిచేస్తోంది. కొద్ది కాలం నుంచి ఈ సందేహానికి సమాధానాన్ని కనుగొన్నారు డబ్బులున్నోళ్లు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య నేపథ్యంలో సంపన్నులు పలువురు.. కరోనాకు చిక్కకుండా ఉండేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కొందరు ప్రత్యేకంగా తయారు చేసిన బంకర్లకు వెళ్లిపోతే.. మరికొందరు కరోనా ఫ్రీ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారిని రారమ్మని ఆ దేశాలు ఆహ్వానిస్తున్నాయి.
సదరు దేశాలు కోరినంత డబ్బులతో అడుగు పెడతామంటే రెడ్ కార్పొరేట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నాయి. తమ దేశంలోనే ఉండిపోవటం.. పెట్టుబడులు పెట్టటం.. వ్యాపారాలు చేయటం లాంటివి చేస్తున్నారు. కొన్ని దేశాలు అయితే ఏకంగా పౌరసత్వాలు ఇచ్చేందుకు సైతం ఓకే చెప్పేస్తున్నాయి. దీంతో కరోనా పీడ గురించి అదే పనిగా ఆందోళన చెందే కన్నా.. ఉన్న ఇంటిని.. దేశాన్ని వదిలేసి.. ఎంచక్కా విదేశాలకు ఎగిరిపోతున్నారు కుటుంబ సభ్యులతో సహా.
సంపన్నులకు కరోనా ఫ్రీ దేశంగా అందరిని ఆకర్షిస్తోంది న్యూజిలాండ్. ఇప్పటికే తమ దేశం కరోనా ఫ్రీ అని అధికారికంగా ప్రకటించిన ఆ దేశానికి వెళ్లిపోతే.. మహమ్మారి గోల ఉండదని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.14 కోట్లు చెల్లిస్తే.. న్యూజిలాండ్ లో ఉండొచ్చు. ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. చదువుకోవచ్చు. అదే రూ.70 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలే కానీ ఏకంగా రెసిడెంట్ వీసా కూడా పొందే వీలుంది. దీంతో.. చాలామంది చాయిస్ న్యూజిలాండ్ అవుతోంది. ఈ దేశంతో పాటు యూరోపియన్ దేశమైన మాల్టా దీవి కూడా సంపన్నుల్ని తెగ ఆకర్షిస్తోంది.
రూ.10 కోట్లు చెల్లిస్తే చాలు.. పెళ్లైన జంటకు ఆ దేశం పౌరసత్వం ఇవ్వటమే కాదు.. అక్కడే ఇళ్లు.. స్థలాలు కొనుక్కునే వీలుంది. మరో ఒకట్రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచాన్ని వదలని నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లి ఎంచక్కా బతికేయొచ్చన్న యోచనలో పలువురు సంపన్నులు ఉన్నారు. యూరప్ లోని పోర్చుగల్ కూడా ఈ జాబితాలో ఉంది. ఏ దేశాలు అయితే కరోనాను బాగా కట్టడి చేస్తున్నాయో.. ఆ దేశాల జాబితాల్ని తీసుకొచ్చి.. అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి అక్కడకు ఎగిరిపోతున్నారు సంపన్నులు.