న్యూయార్క్ లో మంటపెట్టిన పొగ... తెరపైకి ఢిల్లీ!

Update: 2023-06-08 13:00 GMT
కెనడాలో అడవి మంటలు అవిరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఉత్తర అమెరికాలోని వాతావరణం పూర్తిగా మారిపోతోంది. అత్యంత ప్రమాద పరిస్థితికి అక్కడి వాయు కాలుష్యం పెరిగిపోతోంది దీంతో... అధికారులు ఉత్తర అమెరికా అంతటా హై-రిస్క్  ఎయిర్  క్వాలిటీస్  హెచ్చరికలు జారీ చేసింది అమెరికా ప్రభుత్వం. అయితే తాజాగా ఆ పరిస్థితి మరింత తీవ్రతరం అయినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా భారతదేశ రాజధాని ఢిల్లీ టాపిక్  తెరపైకి రావడం గమనార్హం.

కెనడాలోని క్యూబెక్, అంటారియో ప్రాంతాల్లో మొత్తం 211 అడవి మంటలు మండుతుండగా.. వాటిలో 145 మంటలు పూర్తిగా నియంత్రణ కోల్పోయి మరీ చెలరేగిపోతున్నాయి. దీంతో వీటి ప్రభావం సమీపంలో ఉన్న న్యూయార్క్ నగరంపై తీవ్రంగా పడుతుంది. దీంతో... ప్రస్తుతం న్యూ యార్క్ నగరంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆన్ లైన్ వేదికగా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

కెనడాలో నియంత్రణ లేని అడవి మంటల కారణంగా, న్యూయార్క్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రకరకాల షేడ్స్ లో సిటీ దర్శనమిస్తుంది. ఇదే సమయంలో గాలినాణ్యత అంత్యంత దారుణంగా పడిపోయింది. ఈ సమయంలో వృద్ధులూ, పిల్లల్లూ వీలైనంతవరకూ ఇంటినుంచి బయటకు రావొద్దనే సూచనలు వెలువడుతున్నాయి.

ఇక శ్వాసకోస సంబంధిత వ్యాదులు ఉన్నవారైతే ఈ గాలి పీల్చడంతో పరిస్థితిని తీవ్రతరం చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా అమెరికా ప్రజల్లో హస్తిన వాతావరణానికి సంబంధించ చర్చ కూడా మొదలైందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యత కలిగిన ప్రధాన నగరంగా న్యూయార్క్  నగరాన్ని అధిగమించిన ఢిల్లీ గురించిన చర్చ ఆన్ లైన్ వేదికగా నడుపుతున్నారు అమెరికన్లు!

"మనకే ఇలా ఉంటే… వింటర్ లో ఢిల్లీలో జనం ఎలా ఉంటారో” అని అనుకుంటున్నారో ఏమో కానీ… న్యూయార్క్ సిటీలో గాలి రంగులు మారిపోవడంతో ఢిల్లీలో వాతావరణం, వాయు కాలుష్యంపై ఆన్ లైన్ వేదికగా తెగ చర్చలు చేస్తున్నారు అమెరికన్లు.

ఈ సందర్భంగా... న్యూయార్క్ నగర వాసులు రాత్రుల్లు వీధుల్లోకి వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఆ సంగతి అలాఉంటే... ఈ అడవి మంటల వల్ల న్యూయార్క్ నగరం ఎలా మారిపోయిందనే కవరేజీని వర్ణిస్తూ అనేక వీడియోలు సోషల్ నెట్‌ వర్క్‌ లలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నెటిజన్లు పోస్ట్ చేసిన వీడియోలు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు ఇతర ప్రాంతాల ప్రజలు. మిట్ట మధ్యాహ్నం తీసిని వీడియోల్లో న్యూయార్ నగరం... సాయంత్రం ఐదు ఆరు అయినట్లుగా కనిపించడంతోపాటు.. సమీపంలో అగ్నిప్రమాదం జరిగిన లుక్ తో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి!


Full View

Similar News