• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: అమెరికాలో 5...

బ్రేకింగ్: అమెరికాలో 5 వేలు దాటిన కరోనా మృతులు !

By - Tupaki Desk
Update: 2020-04-02 10:10 GMT
కరోనా వైరస్ ... ప్రపంచవ్యాప్తంగా ఈ  మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే కొన్ని వేలమందిని మృత్యువు ఒడిలో చేర్చింది.  ఈ కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయడానికి ప్రపంచం మొత్తం శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించి, ప్రజలను ఇంట్లో నుండి బయటకి రావద్దు అంటూ హెచ్చరికలు జారీచేసింది. ప్రపంచంలోని 200పైగా దేశాలకు విస్తరించిన ఈ కరోనా వైరస్‌, అగ్రరాజ్యాన్ని సైతం హడలిపోయేలా చేస్తుంది. 

రోజుకు సగటున 20వేల మందికిపైగా అమెరికాలో  ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 884మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో కరోనా వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 5,093కు చేరింది. దేశంలో ఇప్పటి వరకూ 2.15 లక్షల మందికి వైరస్ సోకినట్టు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికా లో నమోదయ్యాయి. గత వారం రోజులుగా అమెరికా లో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరిగి పోతుండటంతో అమెరికా ప్రజలు భయంతో వణికి పోతున్నారు.

అయితే, దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న కూడా, అమెరికా ప్రెసిడెంట్   పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటించడానికి  మరోసారి నిరాకరించారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆయా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ పై నిర్ణయం తీసుకుంటున్నాయని ట్రంప్  స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పటికే 30కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముందస్తు ఆంక్షలు ఏప్రిల్‌ 30వరకు కొనసాగనున్నాయి. ఇకపోతే మరో  30 రోజులపాటు సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్‌ తీవ్రత తగ్గించ వచ్చని అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే అందరికి సూచించారు.
Tags:    
  • Corona Virus In America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS