మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కొత్త రూల్స్ వర్తిస్తాయి : కేంద్రం !
గత కొన్ని రోజులుగా తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలు, నేరపూరిత సమాచారాన్ని ప్రసారం చేస్తున్న సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్ ఫాంలపై కేంద్రం కొరడా ఝలిపించింది. వీటిని నియంత్రించేలా కఠిన నిబంధనావళిని కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది. తమ వేదికలపై ప్రసారమయ్యే కంటెంట్ కు సంబంధించి యూట్యూబ్, ఆమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు అనుసరించాల్సిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021 పేరుతో వివరాలని వెల్లడించారు. ఈ నిబంధనలతో ఓటీటీ, సోషల్ మీడియాకు దాదాపు కళ్లెం పడినట్టే. ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలకు మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు స్పష్టం చేసింది.
తాజా, నిబంధనల ప్రకారం.. ఏదైనా పోస్టును తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేస్తారు. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. నోటీసులు జారీచేసిన దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్ ను తొలగించాలి. ఇక అధికారులు ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంటల్లోగా పూర్తి సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ డేటా చవకగా లభిస్తున్న భారత్, సోషల్ మీడియా సంస్థలకు అతిపెద్ద లాభదాయక మార్కెట్ గా మారిన విషయం తెలిసిందే. భారత్ లో వాట్సాప్ కు 53 కోట్ల మంది, ఫేస్ బుక్ కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్ కి 1.75 కోట్లమంది, ఇన్ స్ట్రాగామ్ కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. సోషల్ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. తాజాగా ఐటీ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ సోషల్ మీడియా తో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కి కూడా వర్తిస్తాయని ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.
ఈ నిబంధనల నుండి టీవీ చానెళ్లు , న్యూస్ పేపర్లు ను మినహాయింపు ఇవ్వడానికి మంత్రి నిరాకరించారు. తక్షణమే రూల్స్ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. టివి అండ్ ప్రింట్ మీడియాకి మినహాయింపు ఇస్తే డిజిటల్ న్యూస్ పుబ్లిషర్లు వివక్ష అవుతుందని తెలిపారు.